కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Divya
సాధారణంగా పూర్వకాలంలో అయితే వయసు పైబడిన వారికి మాత్రమే కంటి చూపు మందగించేది. కానీ ఇటీవల కాలంలో చాలామంది పిల్లలు కూడా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో అత్యధిక టెక్నాలజీ వల్ల ఎక్కువగా పిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్, లాప్ టాప్ , టీవీ వంటి వాటికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. ఒక వీటి నుంచి వెలువడే హానికరమైన కిరణాలు కంటిలోపల కార్నియాను పొడిబారేలా చేస్తున్నాయి. ఫలితంగా చూపు మందగిస్తుంది. అందుకే చాలామంది కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా కంటికి కావలసిన పోషకాలు, ఖనిజాలు లభించినప్పుడే కంటి దృష్టి మెరుగుపడుతుంది. ముఖ్యంగా పండ్లు , కూరగాయలు తీసుకోకుండా చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. కాబట్టి వీటి వల్ల కూడా చూపు మందగించే ప్రమాదం ఉంటుంది. ఇదిలా ఉండగా గతంలో రోజు రోజుకి కళ్ళద్దాలు పెట్టుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కళ్ళద్దాల వాడకం తక్కువ అవుతోందని చెప్పవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం కాంటాక్ట్ లెన్స్ ధరించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అంతేకాదు ఫ్యాషన్ లో భాగంగా వీటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 2022 నుంచి 2025 మధ్య కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోయి అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు . కానీ నేత్ర వైద్య శాస్త్ర ప్రొఫెసర్ రాధికా టాండన్ మాట్లాడుతూ కాంటాక్ట్ లెన్స్ ధరించే వారికి ఆమె కొన్ని జాగ్రత్తలు సూచించడం జరిగింది .కాంటాక్ట్ లెన్స్ కాలుష్యం లేదా దుమ్ము తో నిండి ఉండటం వల్ల మనం వాటిని శుభ్రం చేయకుండా ధరించినట్లయితే తీవ్రమైన దృష్టి సమస్యలకు దారితీస్తుంది అని ఆమె హెచ్చరిస్తున్నారు. మనకు సరిపడని కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు.. దృష్టిలోపం.. రెటీనా డిటాచ్మెంట్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్ ధరించకపోవడం ఒక వరకు మంచిదని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: