చిగుళ్లలో రక్తస్రావమా.. అయితే హోమ్ రెమెడీ ట్రై చేయాల్సిందే..?

Divya

సాధారణంగా దంతాలను రోజుకు రెండుసార్లు టూత్ పేస్ట్ లేదా ఉప్పు తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది రోజు ఉదయం మాత్రమే దంతాలను శుభ్రం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం కొంతమంది చిగుళ్లలో రక్తస్రావం రావడానికి కారణం ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లతో పాటు శరీరంలో విటమిన్ సి కూడా లోపించినప్పుడు ఇలాంటి రక్తస్రావం అధికం అవుతుందట. ఇక తరచుగా చిగుళ్లవాపు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
దంతాల నుంచి రక్తం.. చిగుళ్ల వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. దంతాలకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి బయటపడేందుకు ఉప్పు నీరు చాలా బాగా పనిచేస్తుంది. ఉప్పు నీటిని పుక్కలించడం వల్ల దంతాల సమస్యలు దూరం అవుతాయి.
ఆవాల నూనె కూడా దంతాల సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది. మీకు దంతాల దగ్గర ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆవాల నూనె తీసుకొని నొప్పి ఉన్నచోట కొద్దిగా ఉప్పు కలిపి మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల సమస్యలు దూరం అవ్వడమే కాదు దంతాలు దృఢంగా కూడా మారతాయి.
సౌందర్యసాధనంగా పిలువబడే కలబందలో కూడా సమస్యలను దూరం చేసే శక్తి ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు నోటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చాలా చక్కగా సహాయపడతాయి.
పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల నోటిలోని బాక్టీరియా తో పోరాడి నోటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక ఆవ నూనె ,ఉప్పు, పసుపు కలిపి రాస్తే చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి.
యూకలిప్టస్ ఆయిల్ కూడా నోటి సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు యూకలిప్టస్ నూనె తో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: