లైఫ్ స్టైల్: ఈ ఫుడ్స్ మైక్రోవేవ్ ఓవెన్ లో వండుతున్నారా..?

Divya
ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు కూడా ఏ పని అయినా సరే సులభంగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా వంట ఇల్లు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎప్పటికప్పుడు ఆడవారికి శ్రమ తగ్గించడానికి సరికొత్త టెక్నాలజీతో కలిగిన వస్తువులు మార్కెట్లో విడుదల అవుతున్నాయి.. ఇక అలాంటి అధునాతన ఫీచర్ కలిగిన వస్తువుల లో మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఒకటి.. ఈ మధ్య కాలంలో చాలా మంది వంట ఇళ్లల్లో ఈ మైక్రోవేవ్ ఓవెన్ ను మనం చూడవచ్చు.. ఈ మైక్రోవేవ్ ఓవెన్లో వంట సులభంగా వేగంగా తయారై రావడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది అనే కారణంగా ప్రతి ఒక్కరు ఈ మైక్రోవేవ్ ఓవెన్ ను వారి వంట ఇంటిలో ఒక భాగంగా చేస్తున్నారు.
అయితే ఈ మైక్రోవేవ్ ఓవెన్ లో అన్ని రకాల వంటలను వండ కూడదు అని ఫలితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను మాత్రమే మనం మైక్రోఓవెన్ ఓవెన్ లో తయారు చేసుకోవచ్చు.. కొన్ని వంటకాలు ఎప్పుడూ కూడా వండకూడదు అవేంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
చికెన్ :
చికెన్ లేదా చికెన్ తో చేసే ఆహారాన్ని అయినా సరే ఓవర్ హీట్ చేయకూడదు.. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు పూర్తిగా తగ్గిపోతాయి.. రుచి కూడా తగ్గిపోతుంది.. అందుకే నిపుణులు చెబుతున్న సలహా ప్రకారం మైక్రోవేవ్ ఓవెన్ లో చికెన్ కి సంబంధించిన ఎటువంటి పదార్థాలు ఉండకూడదు.
కోడిగుడ్లు:
కోడి గుడ్డుతో చేసే ఏ వంటకమైన సరే మైక్రోవేవ్ ఓవెన్ లో పెడితే చిటికెలో తయారవుతుంది.. చాలా మంది సమయం తక్కువ.. పని కూడా తక్కువ అని ఆలోచించి మైక్రోవేవ్ ఓవెన్ లో గుడ్లను ఉడకబెడతారు.. అలాగే కాల్చడానికి ఇష్టపడతారు.. మైక్రోవేవ్ ఓవెన్  ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఆధారంగా ఇది పనిచేస్తుంది కాబట్టి గుడ్డులో ఉండే ముఖ్యమైన పోషకాలు కూడా పూర్తిగా కోల్పోతాయి

వీటితో పాటు నూనెను వేడి చేయడం, పుట్టగొడుగులు వండడం,అన్నం తయారు చేయడం లాంటివి ఎప్పుడూ కూడా  ఈ మైక్రోవేవ్ ఓవెన్లో వండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: