లైఫ్ స్టైల్:పచ్చకామర్ల తో బాధపడుతున్న వారు దీనితో బై బై చెప్పండి..!!

Divya
పచ్చకామెర్లను జాండిస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు.. ఇక ఈ వ్యాధి బారిన పడ్డ వారు పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే ఈ జాండిస్ వస్తే చాలా మంది భయపడడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల వీటి నుంచి మనకి కాస్త ఉపశమనం కలుగుతుంది.. మనం సాధారణంగా చేసుకొని తినే వాటిని తినడం, తాగడం ద్వారా జాండీస్ మాయమవుతాయట.. అది కూడా మన ఇంట్లో దొరికే ఎటువంటి కొన్ని పదార్థాలతో.. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1).వేపాకు మంచి యాంటీ వైరస్ లక్షణాల గుణం కలిగి ఉంటుంది.. అందుచేతనే ఆరోగ్య వైద్య శాస్త్రంలో దీనికి గొప్ప పేరు ఉంటుంది. ఎవరైనా ఇంట్లో పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు అయితే.. వేపాకుతో తేనెను కలుపుకొని ఒక వారం రోజులు తిన్నట్లయితే వాటి నుంచి విముక్తి పొందవచ్చు..
2).జీర్ణ వ్యవస్థను కాలేయానికి బాగా ఉండడానికి చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది. అందుచేతనే పచ్చ కామెర్లు వచ్చిన వారికి చెరుకు రసం బాగా తాగమని కొంతమంది వైద్యులు తెలియజేయడం జరుగుతుంది.
3).ఇక కూరగాయలలో టమోటా లైకో పిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడం జరుగుతుంది. తగిన మోతాదులో వీటిని తీసుకుంటే పచ్చకామర్ల నుండి పోరాడటానికి బాగా సహాయపడుతాయి.
4).ఆకుకూరల్లో పాలకూర కి కాస్త ప్రత్యేకత ఉండనే ఉంటుంది.. అందుచేతనే మన శరీరంలో ఉండే లివర్ ని బాగా ఆరోగ్యంగా ఉంచడానికి ఇందులో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.. అందుచేతనే పచ్చకామెర్లకు ఉపశమనం కలుగుతుంది.
5).ముల్లంగి ద్వారా హెపటైటిస్ కి చెక్ పెట్టవచ్చు.. అందుచేతనే ఉదయం ఏమీ తినకుండా దీని జ్యూస్ తాగడం వల్ల బోలెడన్ని లాభాలను పొందవచ్చు.
6).బొప్పాయి ఆకుల ద్వారా మనకి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇవి కాలేయ సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయి కాయ, ఆకులు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: