కామిక్ వర్డ్ : డోలో 650

RATNA KISHORE
క‌రోనా స‌మ‌యంలో ఎన్నో జోక్స్ ప్లే అవుతూ వ‌స్తున్నాయి.ముఖ్యంగా మొద‌టి రెండు ద‌శ‌ల క‌న్నా మూడో ద‌శ‌లో కొంచెం వ్యాధి తీవ్ర‌త త‌గ్గ‌డం, వ‌చ్చినా ఓ రెండు మూడు రోజులు జ్వ‌రం ఉండ‌డంతో అంతా డోలో బిళ్ల కొనుగోలు కోసం మెడిక‌ల్ షాపుల‌కు ప‌రుగులు తీస్తున్నారు. దీంతో ఈ టాబ్లెట్ పై తెగ జోక్స్ వ‌స్తున్నాయి. అయితే సంబంధిత కంపెనీ కూడా ఇంత‌టి రెస్పాన్స్ తాము ఎన్న‌డూ ఊహించ‌నే లేద‌ని చెబుతూనే త్వ‌ర‌లోనే ప‌బ్లిక్ ఇష్యూ లోకి త‌మ కంపెనీ పేరును చేర్చాల‌ని భావిస్తోంది. ఏదేమ‌యినప్ప‌టికీ త‌యారీ సంస్థ అయిన మైక్రో ల్యాబ్స్ కంపెనీ ఇప్పుడు త‌మ‌కు పోటీ లేనేలేద‌ని సంబ‌ర‌ప‌డిపోతోంది.ఇది ఏ ఒక్క‌రోజులోనే వ‌చ్చింది కాద‌ని చెబుతూనే, త‌మ విజ‌యానికి కార‌ణం అయిన కంపెనీ ఉద్యోగుల‌కు థాంక్స్ చెబుతోంది.
ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

మార్కెట్లో ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప‌దం డోలో 650.క‌రోనా  రెండు ద‌శ‌ల్లోనూ ఈ మాత్ర పేరు మాత్ర‌మే భ‌లే వినిపించింది. మ‌ళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ద‌శ‌లోనూ డోలో 650 గురించే అంతా మాట్లాడుతున్నారు. చాలా మంది జోకులు కూడా వేస్తున్నారు. స్టే సోలో ఎవైడ్ డోలో అన్న నినాదంతో ట్రోల్స్ కూడాచేస్తున్నారు. మొత్తానికి ఈ మాత్ర  ఒక్క‌టే మూడు వంద‌ల కోట్ల‌కు పైగా లాభాలు తెచ్చి పెట్టింద‌ని బ‌య‌ట టాక్.దీంతో డోలో రూప‌క‌ర్త మైక్రో సంస్థ పండుగ చేసుకుంటుంది.
వాస్త‌వానికి జ్వ‌రానికి సంబంధించి ఇచ్చే పారాసిట‌మాల్ టాబ్లెట్ ఇంత‌టి పేరు తెచ్చుకుంటుంద‌ని ఆ కంపెనీ కూడా ఊహించి ఉండ‌దు. మొద‌ట్లో 500ఎంజీ త‌యారు చేసేవాళ్ల‌మ‌ని,నిపుణుల సూచ‌న మేర‌కు 650ఎంజీ త‌యారు చేస్తున్నామ‌ని, గ‌డిచిన రెండేళ్ల‌లో క‌రోనా మొద‌టి,రెండు ద‌శ‌ల క‌న్నామూడో ద‌శ‌లో డోలో అమ్మ‌కాలు అనూహ్యంగా  పెరిగాయ‌ని కంపెనీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


ఇంకొంద‌రు కార్టూనిస్టులు కూడా డోలో 650పై జోకులు వేస్తున్నారు. ఏయ్ డోలో సిక్స ఫిఫ్టేయ్ అంటూ.. కూర‌ల‌మ్మి వ‌చ్చిన విధంగా బుట్ట‌లో మందులు పెట్టుకుని వీధి వీధికి అమ్ముతున్న విధంగా లేపాక్షి  (ప్ర‌ముఖ కార్టూనిస్ట్) వేసిన బొమ్మ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంకొంద‌రు ఓరినాయినోయ్ డోలో దొర‌క‌డం లేదా అర్జెంటుగా ఓ ప‌ది స్ట్రిప్పులు కొని దాచుకోవాల అని అంటూ జోక్స్ ప్లే చేస్తున్నారు. ఇంకొంద‌రు జాతీయ ప‌క్షి, జాతీయ జంతువు మాదిరిగానే డోలో జాతీయ మాత్ర అని చెప్పుకుంటూ మీమ్స్ వేస్తున్నారు. ఏం అడిగినారు మీకు మ‌ణులా మాణిక్యాలా డోలో టాబ్లెట్టే క‌దా అని ప్ర‌కాశ్ రాజ్ స్టైల్ లో ఇంకొంద‌రు మీమ్స్ చేసి అంద‌రికీ పంపుతున్నారు. ఈ విధంగా జ్వ‌రం క‌న్నా జోక్సే ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: