సంక్రాంతి స్పెష‌ల్ : ఉద్దానం దారుల్లో తెలంగాణ పాట?

RATNA KISHORE
సంక్రాంతి పండుగ ప‌ల్లెల్లో ఎలా ఉంది..పంట ఇంటికి వ‌స్తే ఆనందాలు ప‌ల్ల‌విస్తాయి క‌దా! ఆ విధంగానే పండుగ ఉందా లేదా కార్పొరేట్ నీడ‌ల్లో ఉందా? అన్న సంశ‌యం నుంచి బ‌య‌టకు వ‌స్తే కొద్దిపాటి మార్పులున్నా, అనూహ్య రీతులు ఉన్నా కూడా ఇవాళ పండ‌గ ప‌ల్లెలో కొలువై ఉంది అని అనుకునేందుకు కొన్ని క‌ళా జాత‌ర‌లు ఆన‌వాలు.. ఆ ఆన‌వాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం ఓ బాధ్య‌త.. వాటి గురించి మాట్లాడ‌డ‌మే క‌ర్తవ్యం.

గ‌ల్లీ సిన్న‌ది ఎట్లున్న‌ది
తెలంగాణ‌లో గానం
మ‌న ప‌ల్లెకు వ‌చ్చిన తీరు
ఎట్లున్న‌ది
పాట రెండు ప్రాంతాల‌కు ప్ర‌తినిధి
రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం చెరిపిన
సాహ‌సి కూడా!
స్వ‌రం ఇచ్చొటే.. ప‌దం ఇచ్చొటే..

శ్రీ‌కాకుళం దారుల్లో తెలంగాణ పాట..వెంక‌న్న పాట..గోర‌టి వెంక‌న్న పాట.. శ్రీ‌కాకుళం దారుల్లో జానప‌ద సోయగాల్లో మునిగి తేలిన పాట..అల‌తి అల‌తి పదాల ఆనందాల ఊట.. రేలా రే రేలా జానకీ రావు పాట.. వంగ‌పండు ఉష పాట ఇంకా ఇంకొంద‌రి పాట. ఉద్దానం నేల‌లో మ‌రో స్వ‌ర సీమ దారుల్లో.. సంక్రాంతి వేళ ప‌చ్చంద‌నాల న‌డుమ పాట... మొగిలిపాడు పాట..మంద‌స పాట.ఆ దారిన వ‌చ్చి పోయిన ప‌లాస పాట.. ఇంకా ఎన్నెన్నో పెద్ద పండుగ వేళ.. పెద్ద‌ల దీవెన‌లు అందుకున్న పాట.. అమ‌రుల‌ను స్మ‌రించిన పాట.. నిన్న‌టి వేళ సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా సిక్కోలు జానప‌ద వేదిక ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్రాంతాల హ‌ద్దులే చెరిపి పోయిన పాట..


ప‌లాస‌కు కాస్త దూరం. హ‌రిపురం అనే ప్రాంతానికి ఇంకాస్త ద‌గ్గ‌ర.. నాలుగు అడుగులు వేస్తే స‌ముద్ర తీరానికి ఇంకాస్త ద‌గ్గ‌ర.. మొగిలిపాడు.. మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు ఇలాకా. ఆ ఊళ్లో పండుగ.. జాన ప‌ద పండుగ..కొన్ని క‌ళా బృందాలు వ‌చ్చి త‌మ పాట‌ను వినిపించి వెళ్తాయి ఏటా! ఉద్దాన గ్రామాల స‌హ‌కారంతో ఏటా జ‌రిగే ఈ క‌ళా జాత‌ర‌కు చుట్టు పక్క‌ల నుంచి వంద‌ల మంది వచ్చి ప్ర‌ద‌ర్శించి వెళ్తారు.. ఇదొక ఆన‌వాయితి. ఇక్క‌డే ఉద్య‌మాలు పుట్టాయి..ఇక్క‌డే వెనుక బాటుపై తిరుగుబాటు ప్రారంభం అయింది.. ఇక్క‌డే కొంద‌రు అమ‌రుల జ్ఞాప‌కాలు తిరుగాడుతున్నాయి కూడా! అందుకే గోర‌టి పాట‌కు అంత‌టి ఖ్యాతి.. మా జిల్లాపై ఆయ‌న‌కు ప్రేమ ఉంది..వెనుక‌బాటు పై బాధ ఉంది.. వీటితో పాటు పాల‌కులు ఇంకాస్త బాగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి అన్న న‌మ్మ‌కం కూడా ఆయ‌న‌తో పాటు మా అంద‌రిలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: