లైఫ్ స్టైల్ : మన వంటింట్లో దొరికే దీనిని శీతాకాలంలో తినవచ్చా..?

Divya
మన వంటింట్లో దొరికే పదార్థాలలో బెల్లం కూడా ఒకటి.. దీనిని అతిగా తినడం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి అన్నట్లుగా కొంతమంది వైద్యులు తెలియజేయడం జరుగుతుంది.. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలా ఎక్కువగా దొరికే పదార్థం ఇది. అయితే బెల్లం లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ.. అతిగా తీసుకోవడం వల్ల హానికరమట.. అయితే కొంతమంది నిపుణులు మాత్రం బెల్లాన్ని తీసుకోవడం వల్ల కొన్ని రోగాలు దూరం అవుతాయని తెలియజేస్తున్నారు.. అయితే అతిగా తీసుకుంటే ఏం నష్టం జరుగుతుంది.. తక్కువ మోతాదులో తీసుకుంటే ఏం లాభం వస్తుందో ఇప్పుడు చూద్దాం.

బెల్లం లో ఐరన్, పొటాషియం.. ఇతర పోషకాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీజన్లో వీటిని తింటే ఈ పోషకాలు తగ్గిన వారికి చాలా మేలు. ముఖ్యంగా మన శరీరంలో ఉండే ఊపిరితిత్తులను శుభ్రపరిచడంలో ఈ బెల్లం ఎంతో సహాయపడుతుంది. అందుకనే బెల్లాన్ని బాగా తీసుకోవాలని కొంతమంది వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ చలి కాలంలో షుగర్ పేషెంట్లు వీటిని తీసుకోవడం చాలా ప్రమాదమని తెలియజేస్తున్నారు వైద్యులు. ఇవి తీసుకోవడం వల్ల ఇతర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు.
చక్కెర, బెల్లం ప్రాణానికి హాని కాదు కానీ.. బెల్లం పాకు వల్ల వచ్చే.. బెల్లం అతిగా ఉపయోగించుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక మోస్తరు లో తీసుకుంటే బ్లడ్ పెరిగే అవకాశం ఉంటుంది. పల్లెలలో తయారుచేసే బెల్లం లో కాస్త మట్టి కూడా కలుపుతారు అట. ఇలాంటి బెల్లం తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుచేతనే చక్కెర బెల్లాన్ని కాస్త తగినంతగా తీసుకోవడం మంచిదట. ముఖ్యంగా కడుపు మంట సమస్య, అధిక కొవ్వు ఉన్న వారు వీటిని తీసుకోకూడదని తెలియజేస్తున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: