లైఫ్ స్టైల్: నాన్ స్టిక్ పెనం మీద దోశలు వేస్తున్నారా..?

Divya

మనం నేర్చుకునే జీవనశైలిలో.. కొన్ని అలవాట్లను కూడా నేర్చుకున్నాము. ఉదయం లేవగానే కాఫీ, టిఫిన్ వంటివి భుజిస్తూ ఉంటాము. ఎక్కువగా మన టిఫిన్ అంటే దోసెలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. కాకపోతే మనం ఐరన్ పెనంపై ఈ దోశలు పోయడం చాలా కష్టమని వాటిని పక్కన పడేస్తూ ఉంటారు. అంతేకాకుండా సులువైన వాటిలో దోసెలు వేస్తూ భుజిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ స్టిక్ పెనం మీద దోశ లు వేసుకొని తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టం చూపుతారు. ఇది చూడడానికి దోశలు చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు తేలికగా పని జరిగిపోతుంది..
ఒక్కొక్కసారి ఐరన్ పెనం మీద దోశలు సరిగా రాక పోవడమే కాకుండా విరిగి పోతూ ఉంటాయి. ఐరన్ పెనం మీద వేసిన దోశ లు ఎంత రుచికరంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే ఐరన్ పెనం మీద దోశ విరిగిపోకుండా నాన్ స్టిక్ పెనం మీద వచ్చినట్టుగా రావాలి అంటే ఇక్కడ కొన్ని చిట్కాలు పాటించాలి. మనం దోశ పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా నానబెట్టిన మినప్పప్పు, బియ్యం ఉపయోగిస్తాము.. మినప్పప్పు లో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాకాహారులు అల్పాహారంలో ఇడ్లీ , దోశ లాంటి తీసుకుంటే ప్రోటీన్ పొందవచ్చు.
ఐరన్ పెనం మీద దోశ లు చక్కగా రావాలి అంటే ,కొద్దిగా నూనెను ఎక్కువ వేసి లో ఫ్లేమ్  మీద పెట్టి దోశ వేసుకోవాలి. ఇలా చేయడంవల్ల దోశ బంగారు రంగులోకి రావడమే కాకుండా చాలా క్రిస్పీ గా కూడా ఉంటుంది. ఇలా ఇనుప పెనం మీద వేసిన దోశలను చట్నీ, నెయ్యి, పొడి లేదా బెల్లంతో కలిపి తీసుకుంటే ఆ మజానే వేరు. దోశలు వేసుకునే సుమారుగా అరగంట ముందు ఫ్రిజ్ నుండి దోశ పిండి ని బయట పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు కరకరలాడడమే కాకుండా రుచిగా కూడా  ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: