లైఫ్ స్టైల్: మీ వంటల్లో పాలకూరను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? అయితే కాస్త ఆగండి..!!

Divya
సాధారణంగా చాలామంది చెప్పే విషయం ఏమిటంటే ఆకుకూరల్లో పాలకూర చాలా శ్రేష్టమైనది అని.. పాలల్లో లభించే కాల్షియం మనకు పాలకూరలో కూడా లభిస్తుంది.. కాబట్టి చిన్న పిల్లలకు ఈ పాలకూర చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు.. చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు అలాంటి వారికి పాలకూర తో రకరకాల వంటలు తయారు చేసి మరీ పెడుతూ ఉంటారు ఆ పిల్లల తల్లులు.. అయితే పాలకూర ను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట.. అయితే ఇది నిజమా కాదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం..

అసలు విషయానికి వస్తే , చాలామందిలో ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.. అనే అపోహతో చాలామంది ఈ ఆకు కూరలను తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు..ఫలితంగా పోషక లోపాలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా పాలకూర ను తినడం వల్ల కిడ్నీలో ఎటువంటి రాళ్లు ఏర్పడవని వైద్యులు చెబుతున్నారు.. కానీ  కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్న వారిలో వోక్సాలేట్స్ వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.
ఎవరైతే ఎక్కువ సమయం ఎండలోనే గడుపుతారో అలాంటి వారికి కిడ్నీలలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు  ఐదు నుంచి ఆరు లీటర్లు నీటిని తీసుకోవాలి. అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం మాత్రమే కాకుండా ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.
ముఖ్యంగా ఆకు కూరలు వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుకూరలను వండడానికి ఐదు నిమిషాల ముందు ఉప్పు నీటిలో నానబెట్టి , ఆ తర్వాత మంచినీటిలో రెండుసార్లు కడిగి..కట్ చేసి నీళ్లు వేయకుండా ఆకుకూరలను వండుకోవాలి. ఒకవేళ ఆకుకూరలను ఉడకబెట్టి ఆ నీటిని పారబోయడం వల్ల ఆ నీటిలో విటమిన్లు అన్నీ పోతాయి.. నీళ్లు లేకుండా ఆకుకూరలను నూనెలో వేయించి వండుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: