లైఫ్ స్టైల్: ఇకపై కాఫీ తోటలతో పని లేదట..!

Divya
ఉదయం లేవగానే కొంతమంది కాఫీ,టీ,తాగుతూ ఉంటారు.ఇది ఒక అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. దాంతో ఇప్పుడు ఎక్కువగా కాఫీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక కొంతమంది శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ కాఫీ ని తయారు చేశారట.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ కృత్రిమ కాఫీ ని ఎక్కడ తయారు చేస్తున్నారో చూద్దాం.

ఈ కృత్రిమ కాఫీ ద్వారా చెట్ల నరికివేత ను పూర్తిగా తగ్గించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కృత్రిమ కాఫీ పొడిని ఒక టెక్నికల్ ల్యాబ్ లో అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ కాఫీ పొడి రుచి, వాసనలో ఎలాంటి మార్పులు ఉండాలని. కాఫీ ని బాగా ఉపయోగించే దేశాలలో ఫిన్లాండ్ కూడా ఒకటి. అందుచేతనే ఆ శాస్త్రవేత్తలు కాఫీ కొరత లేకుండా ఉండటం కోసం ఒక కృత్రిమ కాఫీ ని తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని 2025 నాటికి మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు గా తెలుపు కొచ్చారు.
ప్రపంచంలో కాఫీ ఉత్పత్తి మొత్తం..56% ఎక్కువగా అరబికా ప్లాంట్ తోనే  ఉత్పత్తి జరుగుతోందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. 47 సంవత్సరాల వయసుగల మొక్క కణజాలం నుంచి ఈ కృత్రిమ కాఫీ పొడిని తయారు చేయవచ్చు అన్నట్లుగా ఆ పరిశోధనలు తెలియజేస్తున్నారు. ఈ కాఫీ ఒరిజినల్ కాఫీ మాదిరిగానే ఉన్నట్లుగా తెలియజేశారు. ఈ విషయాన్ని డాక్టర్ హైకో రిషర్ తెలియజేశారు. అంతేకాకుండా ఈ కాఫీ తాగిన అనుభవం చాలా అద్భుతంగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు.
ఈ కృత్రిమ కాఫీ వల్ల రాబోయే కాలంలో చెట్లను నరికే బాధ్యత తక్కువ అవుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కాఫీ డిమాండ్ బాగా పెరుగుతుండటంతో పాత కాఫీ చెట్లను ఎక్కువగా నరికి వేస్తున్నారని, ఈ కొత్త కాఫీపొడితో ఆ సమస్యకు ముగింపు పలకవచ్చని వారు తెలియజేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ కృత్రిమ కాఫీ ని మనం కూడా రుచి చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: