మేఘాల పైన గ్రామం... అక్కడే ఉండిపోవాలన్పించే భూతల స్వర్గం !

Vimalatha
మేఘాల పైన గ్రామం అంటే ఊహించుకోవడానికే చాలా బాగుంది కదా. నిజంగానే అలాంటి గ్రామం ఉంది. ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్ లో. అది అందమైన నిశ్శబ్ద ప్రదేశం అయినప్పటికీ పర్యాటకులకు, పసిఘాట్ ను భూతల స్వర్గంగా భావిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీని ఎత్తు సముద్ర మట్టానికి 155 మీటర్లు అని చెబుతారు. నగరాల గజిబిజి జీవితం, ఒత్తిడితో కూడిన దినచర్య నుండి విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ప్రజలు పర్వతాల వైపు మొగ్గు చూపుతారు. ఢిల్లీ నుండి ఎక్కువ మంది ప్రజలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వైపు వెళతారు. కానీ ఈశాన్య భారతదేశంలో 'సెవెన్ సిస్టర్స్' అని పిలవబడే రాష్ట్రాల అందం కూడా తక్కువేమీ కాదు. ఈ రాష్ట్రాలలో ఒకటి అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రోజు మనం పసిఘాట్ గురించి మాట్లాడదాం.
పసిఘాట్ గ్రామం మేఘాల పైన ఉందని చెబుతారు. ఇక్కడి విశాలమైన పర్వతాల అందాలు పర్యాటకులను తమ వైపు ఆకర్షిస్తాయి.
పసిఘాట్‌ను అరుణాచల్ ప్రదేశ్ ముఖ ద్వారం లేదా పర్యాటక ద్వారం అంటారు. 1911 లో స్థాపించిన ఈ గ్రామానికి పసి తెగ పేరు పెట్టారు. ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్, రాఫ్టింగ్, సాహసం, జలపాతాలు, అందమైన దృశ్యాలు ఆహా అద్భుతం. ఇక్కడ బౌద్ధ దేవాలయాలు, మ్యూజియం మొదలైనవి కూడా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి.
అడవులలో జింక, కొండచిలువతో సహా అనేక వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు. కేకర్ మోనింగ్ అనేది రోటాంగ్ సమీపంలో ఉన్న ఒక అందమైన పర్వతం. పనాగిన్‌లో మీరు ఎన్నడూ చూడని పకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. పసిఘాట్ నుండి 60 కి.మీ దూరంలో ఉన్న పాంగిన్ గ్రామం సియోమ్. సియాంగ్ నదుల సంగమం వద్ద ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది అద్భుతమైన ప్రదేశం. వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు డిరింగ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించడం మర్చిపోకూడదు. సియాంగ్ బ్రహ్మపుత్ర నది పసిఘాట్ అభయారణ్యం సమీపంలో ప్రవహిస్తుంది.
సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నగరాల నుండి రోడ్డు మార్గంలో పసిఘాట్ చేరుకోవచ్చు. గౌహతి నుండి ఒక రాత్రి ప్రయాణం. రైలు మార్గం విషయానికొస్తే... అసోంలోని ముర్కాంగ్ ఇక్కడి నుండి సమీప రైల్వే స్టేషన్. విమాన మార్గం అంటే... మీరు లీలాబరి విమానాశ్రయం లేదా దిబ్రూగఢ్‌లోని మోహన్‌బారి విమానాశ్రయంలో దిగాలి. అక్కడ నుండి రోడ్డు మార్గంలో పసిఘాట్ చేరుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: