మహిళల కోసం ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్...!

Suma Kallamadi
మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు వారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా, తాజాగా మహిళలకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.
ఈ నెల 22న రాఖీ పౌర్ణమి పండుగ ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా ఈ రోజు అన్నదమ్ములకు రాఖీ కట్టించేందుకుగాను మహిళలు ఎంతో దూరం ప్రయాణించి వెళ్తుంటారు. భారతీయులకు ఉన్న అతి ముఖ్యమైన పండుగల్లో రక్షాబంధన్ ఒకటి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ప్యాసింజర్స్‌కు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఆఫర్ కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో నడిచే ట్రైన్స్‌కు మాత్రమే. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే మహిళా ప్యాసింజర్స్‌కు ఈ ఆఫర్ వర్తించనుంది.

చార్జీలలో తగ్గింపుతో పాటు క్యాష్ బ్యాక్ కూడా వచ్చే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే రాబోయే ఫెస్టివల్స్‌లో కూడా ప్రీమియం రైళ్ల ప్యాసింజర్స్ కోసం మరిన్ని ఆఫర్స్ ప్రవేశపెట్టాలని ఐఆర్‌సీటీసీ ఆలోచిస్తోంది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈ నెల 15 నుంచి 24 వరకు రెండు తేజస్ ట్రైన్స్‌లో ప్రయాణించే మాహిళా ప్యాసింజర్స్ అందరికీ ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ఆఫీసర్స్ తెలిపారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నకాలంలో మహిళలు ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు. క్యాష్ బ్యాక్ అమౌంట్ ద్వారా ఇంకా వేరే ఇతర ప్రయాణాలకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ అమౌంట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత అకౌంట్స్‌లో క్రెడిట్ అవుతుంది. ఇకపోతే ఇటీవల కాలంలో తేజస్ ట్రైన్స్‌లో ప్రయాణించే వారి సంఖ్య వారి క్రమంగా పెరుగుతున్నదని రైల్వే శాఖ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆఫర్ ద్వారా మహిళా ప్యాసింజర్స్ ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. నిరంతరం ప్రయాణికుల సంఖ్య పెరిగేలా పలు చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: