లైఫ్ స్టైల్: వర్షాకాలంలో చేపలు తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..

Divya
సాధారణంగా ఈ వర్షాకాలంలో కూడా కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉంటేనే ,మన ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామందికి ఈ వర్షాకాలంలో గ్యాస్ ,అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలతో పాటు ఏది తిన్నా కూడా జీర్ణం కాక ఇబ్బంది పడుతూ వుంటారు. అందుకే ఈ వర్షాకాలంలో ఎక్కువగా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. అంతే కాకుండా వ్యాయామం చేయడం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిరగడం వంటివి చేస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా మాన్సూన్ కాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీటిని బాగా మరిగించి, చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా పేగు ,కడుపు, జీర్ణాశయం ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లను ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, త్రాగే నీటి వల్లే వస్తుంది.
అందుకే ముఖ్యంగా ఈ కాలంలో వర్షం నీటితో కలుషితమైన, సముద్రం నుండి దొరికే చేపలను అసలు తినకూడదు. కలుషితమైన చేతల ద్వారా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక ఇవే కాకుండా రోడ్డు పక్కన ఎటువంటి పండ్లను కానీ కూరగాయలను కానీ కోసినవి తినకూడదు. ఎందుకంటే వీటి పైన రోడ్డు మీద ఉండే బాక్టీరియా ప్రవేశించి, మనకు హాని కలిగిస్తాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలను కానీ ,శీతల పానీయాలను కానీ తినకూడదు.
పచ్చి ఆకుకూరలను కూడా ఈ వర్షాకాలంలో తినకూడదు. ముఖ్యంగా బ్యాక్టీరియా , వైరస్ లు ఈ ఆకు కూరల పై ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మన శరీరానికి కూడా హానికరం.
మనం తీసుకునే  ఫైబర్ ,ప్రో బయాటిక్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయి , శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియా ను నాశనం చేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: