లైఫ్ స్టైల్ :కొవిడ్ తో పోరాడాలంటే ఈ సూప్ తాగాల్సిందే..

Divya
కరోనా వైరస్ దాడి కి మనం తట్టుకోవాలి అంటే తప్పకుండా మనలో రోగనిరోధక శక్తి పెరగాలి. సహజంగా మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే , ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మన వంటింటి దినుసులలో లభించే ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకమైన ఔషధ గుణం కలిగి ఉంటుంది. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి చింతపండు అలాగే వెల్లుల్లి. వీటితో రసం చేసుకొని తాగడం వల్ల మనలో రోగనిరోధకశక్తి పెరుగుతుందట. అయితే ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం, ఈ రసం చేసుకొని తాగిన వారిలో వ్యాధినిరోధక శక్తి పెరిగినట్లు డైటీషియన్ ప్రియాంక సింగ్ వెల్లడించడం జరిగింది.
ముందుగా ఈ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు గురించి తెలుసుకుందాం..

చింతపండు రసం - ఒక టేబుల్ స్పూన్,
కరివేపాకు - రెండు నుండి మూడు రెబ్బలు,
మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్
టమాటో - ఒకటి చిన్నగా ముక్కలుగా తరగాలి,
వెల్లుల్లి - నాలుగు లేదా ఐదు పాయలు
పసుపు - అర టేబుల్ స్పూన్,
వట్టి మిరపకాయలు - 2
ఆవాలు -1 టేబుల్ స్పూన్
ఇంగువ - ఆఫ్ టేబుల్ స్పూన్,
కొత్తిమీర  - ఒక టేబుల్ స్పూన్ ( తరిగినది),
జీలకర్ర -  ఒక టేబుల్ స్పూన్ ,
నూనె  - ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం:
స్టౌ వెలిగించి దాని  పైన ముందుగా ఒక బాణలి పెట్టి, అందులో మిరపకాయలు , మిరియాలు , జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి దోరగా వేయించి, తర్వాత దానిని మిక్సీ పట్టాలి. ఇక అదే బాణలిలో  కొద్దిగా నూనె వేడి చేసి, తరిగిన టొమాటో  ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. ఇక కొద్దిగా వేగుతున్న సమయంలో చింతపండు గుజ్జు వేసి, రెండు కప్పుల నీరు కలపాలి. ఇక మూతపెట్టి 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరొక బాణలి పెట్టి , అందులో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు లాంటి మసాలా దినుసులు వేసి, ఉడుకుతున్న రసం లో వేయాలి. ఇక గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.

వేడి వేడి అన్నంలో దీనిని తినవచ్చు లేదా అలాగైనా తాగవచ్చు.
ఇక దీనిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుందట. ముఖ్యంగా ఇందులో వాడిన పసుపు, చింతపండు, కరివేపాకు.. వైరస్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది అని ఒక అధ్యయనంలో తేలింది. ఇక వెల్లుల్లి తినడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరగడం కాకుండా తరచూ వచ్చే ఫ్లూ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: