మార్నింగ్ రాగా : ఒప్పుకున్నాం అమ్మాయిలూ మీరే గ్రేట్

RATNA KISHORE

 
ఒలంపిక్స్  ఆరంభంలో మన అమ్మాయి పతకంతో మన దేశ తేజం అటుపై ఇంకొన్ని ఆశల దీపికలు వీళ్లే... అని వింటూ వింటూ  రాస్తున్నానొక మార్నింగ్ రాగా.. అమ్మాయిలు ఏమయినా ఆకాశం నుంచి ఊడిపడ్డారా ..అని రాశానొక చోట.. నిజంగా అమ్మాయిలు ఆకాశం అంచుల వరకూ వెళ్లొస్తుంటే..మళ్లీ ఈ నేల ఈ ఆకాశం వాళ్లకు కాక ఇంకెవరికి ఆతిథ్య సత్కారం ఇస్తుందని సందేహించాలి.. అని అనుకున్నాను.. మనం ఎవరిని  ప్రేమించాలి.. ఎవరి ఆధిక్యతను వద్దనుకోవాలి తెల్సుకోలేంత కాలం ఓడిపోతూనే ఉంటాం. ఈ ఓటమిలో సమాజం భాగస్వామ్యం ఉంది.. ఈ ఓటమిలో కొంత తల్లిదండ్రులూ భాగం కావొచ్చు.. వారిదే బాధ్యత అనలేను కానీ నువ్వు ఆడ, నువ్వు మగ అని చెప్పడం  నుంచి అరవడం దాకా మన ఇంట్లో ఈ తరహా ప్రేమ ఈ తరహా అభిమానం లెక్కకు మిక్కిలి కనిపించవచ్చు.. చెప్పాను కదా! అమ్మాయి గోల్డ్ సర్.. మీరు ప్రేమించండి చాలు పతకాలు ఇస్తుంది అని..! ఈ సారి అమ్మాయి  మనం అనుకు న్నంత గోల్డే.. గిల్టు కాదు.. అందుకే  భారత్ కు రెజ్లింగ్ లో స్వర్ణం తెచ్చింది. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో... పేరు  ప్రియా మాలిక్..

 


కొంచెం అయినా భయం వద్దు ...కొంచెం అయినా ఆందోళన వద్దు సాధనొక్కటే అంతిమం..మరొక అమ్మాయి ఉన్నారు ఆమె పేరు పీవీ సింధూ.. గత ఒలంపిక్స్ లో రజతం తెచ్చారు.. ఈ ఒలంపిక్స్ లో నిన్ననే శుభారంభం చేశారు.. క్లాసు రూమ్ ల్లో ఇంటి వాతావరణంలో కాస్త మార్పులు చేసి చూడండి ఇంకొందరు వస్తారు విజేతల రూపాన. ఈ దేశాన ఇంకాస్త చొరవ ఉంటే మరికొందరు మణిపూరం మాణిక్యాలు మీరా చానూ రూపాన వస్తాయి.. సంస్కృతిలో వస్తున్న మార్పు స మాజంలో వస్తున్న మార్పు.. అన్నీ అందరికీ సమానమే అన్న భావనను నెలకొల్పితే చాలు విజయాలు వస్తాయి.


అమ్మాయిలూ మీరు గ్రేట్ అన్నది..చిన్న మాట..ఈ భూగోళంపై మరో అద్భుతం..నుంచి మీరు వికసిస్తారు ..ఆ అద్భుత సృష్టి మీదే //ఇప్పటికీ గుర్తు మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీని ఉద్దేశించి ఆమె మాతృమూర్తి చెప్పిన మాట.. నువ్వు ఈ దేశం గురించి ఆడుతున్నావు.. అదొక్కటే చాలు మాకు ఇంకేమీ వద్దు అని అన్నారు.. ఈ దేశం కోసం పోరాడే సమయంలో మిథాలీ కన్నీళ్లు పెట్టారు.. ఆమెను తోటి వారే మానసికంగా హింసించారు..అయినా ఆమె వాటిని దాటుకుని వచ్చారు.. కొత్త రికార్డుల రాతకు ప్రాధాన్యం ఇచ్చారు.ఊళ్లో దుఃఖం ఆమె అణుచుకుంటుంది.. బిడ్డల కష్టం ఆమే ఓర్చుకుంటుంది..అవును! పాలించే శక్తి దగ్గర మనం మోకరిల్లితే అసహనం పోతుంది అసమానతా పోతుంది..ఇప్పుడు తారక్ డైలాగ్ ఒకటి ట్రెండ్ ఇన్ లోకి వచ్చింది మళ్లీ..మొన్నటి అరవింద సమేత  డైలాగ్ పాలు ఇచ్చి పెంచిన తల్లులు సర్ పాలించలేరా.. ఈ డైలాగ్ విని ఎందరు స్ఫూర్తిపొందారో కానీ  ఈ డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ మన జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. చాలా రోజులకు అమ్మాయిలూ మీరంతా గ్రేట్ అని  అంటున్నారు.. ఒలంపిక్స్ లో తొలి పతకం అందుకున్న మీరా చానును ఉద్దేశించి.. సోషల్ మీడియా లో కొద్ది పాటి ఆలోచనలో మార్పు.. ఈ మార్పు కొనసాగితే బాగుంటుంది. మనం ఎవరిని గుర్తిస్తున్నామో ఎవరిని గౌరవిస్తున్నామో తెల్సుకుంటే ఇంకా మేలు. నేను ఈ దేశానికి పతకం తీసుకు వస్తాను అంతకుముందు మీరు చేయాల్సిన పని మమ్మల్ని గౌరవించడం అని ఓ స్టార్ అథ్లెట్  ఓ సందర్భంలో అన్నారు. నేను ఓడినా గెలిచినా ఇతరుల గెలుపునకు నా సహకారం ఉంటుంది మీరేం లేని పోని ఏడుపులు ఏడవద్దు అని చెప్పారు సైనా ..గత ఒలంపిక్స్  సమయంలో.. అంతెందుకు సచిన్ లాంటి వారు కూడా ఓ సందర్భంలో సైనాకు మద్దుతు ఇచ్చినవారే.. కాస్త అవకాశం కాస్త ప్రోత్సాహం వాళ్లకు చూడండి ఈ నేలా ఈ నింగీ గర్వించేలా మంచి పనులు చేస్తారు... కొత్త చరిత్రకు కారణం అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: