గ్రీన్ చపాతీని ఎప్పుడైనా చేశారా ?

Satvika
చపాతీని చాలా మంది చేస్తారు. మంచి డైట్ ఫుడ్.. అయితే ఎప్పుడు ఒకేరకం చపాతీల ను తీసుకుంటే బోర్ కొడుతుంది అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. చపాతిని కొత్తగా ట్రై చేయాలి.. ఎప్పుడు ఒకే కలర్ కాకుండా కలర్ కలర్ చపాతీలు చేసుకోవాలని భావించేవాళ్లు వీటిని ఒకసారి చూడండి..
ఇలా రంగుల చపాతీల ను చేసుకోవడానికి  ఎటువంటి ఫుడ్ కలర్ కాకుండా న్యాచురల్ గా దొరికే పదార్థాల తో చేసుకుంటే చూడటానికి కలర్ ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటుగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈరోజు మనం ఆకుపచ్చ రంగు చపాతీలను ఎలా తయారు చేసుకోవాలి.. కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం..
కావలసిన పదార్థాలు :
చపాతీ పిండి (గోధుమ పిండి ) : ఒక కప్పు
ఉడక బెట్టిన పాలకూర :సగం కప్పు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : చపాతీల ను కాల్చుకోవడానికి

తయారీ విధానం :
ఉడకబెట్టిన పాలకూర ను తీసుకొని దానికి చపాతీ పిండి కలుపుకొని మెత్తగా చపాతి పిండిలాగా చేసుకోవాలి.. ఎంత ఎక్కువగా పిసికి కలిపితే చపాతి అంత మెత్తగా వస్తుంది. తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపి చపాతీలను చేసుకోవాలి.. అంతే గ్రీన్ కలర్ చపాతి రెడీ.. పాలకూర లో ఎన్ని పోషకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పోషకాల పొదరిల్లు అని నిపుణులు అంటున్నారు..  ఇకపోతే క్యారెట్, బీట్ రూట్ తో కూడా ఇలానే చేసుకోవచ్చు. చూడటానికి కలర్ ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్ట పడతారు.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. కలర్ ఫుల్ చపాతీల ను ఆస్వాదించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: