అరెవ్వా.. కార్న్ వెజ్ రోల్స్ ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

Satvika
కార్న్.. స్వీట్ కార్న్ ఇలా దీనితో అయిన కూడా రక రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ఏ వంటకైన కార్న్ ను ఈజీగా వాడుకోవచ్చు.. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా పలు రకలా వంటలు స్వీట్ కార్న్ తో చేస్తున్నారు.. అయితే కొన్ని రకాల వంటలు మాత్రం రెస్టారెంట్స్ లలో మాత్రమే దొరుకుతాయి.. అలాంటి వాటిలో ఒకటి రోల్స్.. కార్న్ వెజ్ రోల్స్.. వీటిని ఇంట్లో ఇప్పుడూ తయారు చేసినా కూడా ఏదోక విధంగా వస్తాయని చాలా మంది చేయడమే మానేశారు. ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు చేస్తే అదే టేస్ట్ మీకు వస్తుంది .. ఎలా చేసుకోవాలి..కావలసిన పదార్థాలు ఎంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..
గోధుమ పిండి: రెండు కప్పులు,
స్వీట్‌ కార్న్‌: అర కప్పు,
ఉల్లిపాయ: చిన్నది,
క్యాప్సికమ్‌, క్యారెట్‌ తురుము: అరకప్పు,
సోయా సాస్‌: పావు టీస్పూన్‌,
చిల్లీ సాస్‌: ఒక టీస్పూన్‌,
అజినమొటొ: చిటికెడు,
మిరియాలపొడి: చిటికెడు,
టమాటా సాస్‌: ఒక టీస్పూన్‌,
కొత్తిమీర తరుగు: కొద్దిగా,
ఉప్పు: తగినంత,
పచ్చిమిర్చి: రెండు,
నూనె: సరిపడా
తయారీ విధానం:

గోధుమపిండిలో చిటికెడు ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు కలుపుకొంటూ చపాతీ పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. స్వీట్‌ కార్న్‌ని ఆవిరి మీద ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కాస్త మెత్తబడే వరకు వేయించాలి..క్యారెట్‌, క్యాప్సికం తురుము వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక సోయా సాస్‌, చిల్లీ సాస్‌, టమాటా సాస్‌, తగినంత ఉప్పు, అజినమొటొ, మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి మరో రెండు నిమిషాలు వేగనిచ్చి దింపేయాలి. పక్కనపెట్టిన పిండితో చపాతీలు చేసుకోవాలి. వేడివేడి చపాతీ మధ్యలో కూరపెట్టి రోల్స్‌లా చుట్టుకుంటే అంతే ఎంతో రుచిగా వుండే కార్న్ వెజ్ రోల్స్ రెడీ..చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: