వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందట..

Satvika
వేసవి అంటే జనాలకు భయం.. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు దాహం.. ఎంత నీళ్లను తీసుకున్నా గొంతు ఆరిపోతుంది..దీంతో చాలా మంది వేసవి పానీయాలను తీసుకోవాలని అనుకుంటారు. అంతేకాదు కొన్ని తీసుకున్నా కూడా అవి దాహాన్ని తీర్చవు లేదా జలుబు వంటి అనారోగ్య రుగ్మతలను కలిగిస్తాయి. అలాంటివి ఎదురుకాకుండా కొన్ని రకాల పానీయాలు కూడా ఉన్నాయట.. వాటిని తీసుకోవడం వల్ల శరీరం చల్ల బడుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తీవ్రమైన ఎండల వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకూడదంటే మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.. అవి ఇవే..

కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

షర్బత్‌: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్‌ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.

జల్‌జీరా: నాలుగు చెంచాల ఆమ్‌చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్‌జీరా మిశ్రమాన్ని చేసుకొని తాగితే ఎండ వేడిమి నుంచి బయటపడొచ్చు..

చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడిన ది .. మంచి ఆరోగ్య ఫలితం ఉంటుంది..
పైన తెలిపిన వాటిలో ఏ ఒక్కటి తీసుకున్న కూడా శరీరం వేడి తగ్గుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: