మిరియాలు రోజువారీ ఆహారంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. !!

Suma Kallamadi
మన వంట గదిలో ఉండే ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల్లో  మిరియాలు కూడా ఒకటి.మనం చేసే వంటకి గాటుతనంతో పాటు, రుచి రావాలంటే కొంచెం మిరియాల పొడి దట్టించాలిసిందే. మిరియాలను కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా కూడా  పరిగణిస్తారు.  మిరియాలని  కూరల్లో ఘాటును కోరుకునే వారు కారంకు బదులుగా మిరియాలను వాడతారు . ఒక్క రుచికి, ఘాటుదనానికి మాత్రమే మనం మిరియాలు వాడుతున్నాము అనుకుంటే అది చాలా తప్పు. మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. మిరియాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.  మిరియాల యొక్క ఘాటు దానిలో ఉండే పెప్పరైన్  (piperine) అనే రసాయనం వలన జీర్ణాశయ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాక ఇది ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ గా  కూడా పనిచేస్తుంది. . కాబట్టి, ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చెయ్యడంలో సహాయపడుతుంది. మనందరికీ తెలిసినది మిరియాల వల్ల  ఒక్క జలుబు, దగ్గుమాత్రమే తగ్గుతుందని అనుకుంటే పొరపాటు పడినట్లే. మిరియాల వలన ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..

అవి ఏంటంటే  మిరియాలతో అధిక బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చు.ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాలకు ఉంది. దీనివల్ల మోషన్ అనేది ఫ్రీ గా అవుతుంది. దీని వలన శరీరంలో రక్త ప్రసరణ అనేది  వేగవంతం అవుతుంది.దీనివల్ల శరీరంలో  కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. తమలపాకులతో మిరియాలు కలిపి తింటే బరువు త్వరగా తగ్గుతారు. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.అలాగే శరీరంలో కొవ్వు నిల్వలు కూడా చాలా తగ్గుతాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలుపుకుని ప్రతిరోజు ఉదయం పడగడుపున తాగితే ఎంత కొవ్వయినా సరే కరిగిపోతుంది. అల్లం రసం, తులసి ఆకులు, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే  కడుపులో మంట ఉన్నవారు,  వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే మిరియాలపొడి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి తయారు చేసి ఆ గుజ్జును తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: