మిర్చిని తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందా?

Satvika
మీరు కారం ఎక్కువగా తింటున్నారా? అలా తినడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా హానీ కలుగుతుందా ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి.. అయితే పచ్చి మిర్చి వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.పచ్చిమిర్చి అంటే అందరికీ భయం. ఎంతో కారంగా.. ఘాటుగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా తినడం కన్నా.. కూరల్లో వేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొందరు వ్యక్తులు పచ్చిమిర్చిని డైరెక్ట్‌గానే తినేస్తుంటారు. మజ్జిక, అంబలి, రాగి జావ వంటి ఆహారంపై పచ్చిమిర్చిని తినేస్తుంటారు. అయితే పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది..

ముఖ్యంగా అందరికీ అజీర్తి సమస్యలు వస్తుంటాయి..అజీర్తిని నివారించడంతోపాటు పక్షవాతాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ వంటలో రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది. దెబ్బలు తగిలినప్పుడు రక్తాన్ని కారనివ్వకుండా గడ్డకట్టేలా చూస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

కొవ్వును కరిగించడంలో పచ్చి మిర్చి చాలా బాగా ఉపయోగపడుతుంది.శరీరంలో తెలుపు, గోధుమరంగుల్లో కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్వ చేస్తుంది. గోధుమ రంగు కొవ్వు కణాలను కరిగించేలా చేస్తుంది. పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ ఉందని అమెరికాలోని వ్యోమింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి అని అంటున్నారు. వీటిలో విటమిన్-బి6, విటమిన్-ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.. అందుకే చైనా వాళ్ళు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: