మునక్కాయలు తింటున్నారా ? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Satvika
మునక్కాయలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. సాంబార్ తో పాటుగా కర్రీ లలో కూడా ఈ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. ఎంత ఎక్కువ రుచిగా ఉంటాయో అంతకు మించి ఆరోగ్య విలువలను కలిగి ఉంటాయి. సర్వరోగ నివారిణిగా ఈ మునగను అంటారు.. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ చెట్టును దేవతగా పూజిస్తారు అంటే అతి శయోక్తి కాదు.. పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడతాయట..

ముఖ్యంగా ఈ మునగాకును రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే.. అయితే ఇందులో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.దాదాపు 300 రకాల వ్యాధులను నయం చేయడంలో ఈ మునగ చెట్టు అద్భుతంగా ఉపయోగడుతుంది.ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ దరి చేరవు..

అధిక బరువు తో బాధ పడేవారు ఈ మునగ చెట్టుకు సంబందించిన దేనినైనా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.100 గ్రా. ఎండిన ఆకుల్లో. పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌ శరీరానికి అందుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలను నయం చేసే దివ్య ఔషదం అని చెప్పాలి..ప్రపంచంలో కెల్లా 96 పోషకాలను కలిగి ఉన్న ఏకైక చెట్టుగా ఈ మునగ పిలవబడుతుంది..చూసారుగా విరివిగా కనిపించే మునగాకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటినుంచి మీరు కూడా ఆహారంలో చేర్చుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: