ఉలవలు తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..

Satvika
ఉలవలు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.. ప్రస్తుతం వీటి పేరు పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు.. పాతకాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సన్నగా, ఉక్కులా ఉండేవాళ్ళు మనుషులు. వీటిలో ఫోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి వీరికి తెలియని ఉలవల్లోని పోషకాలను ఇప్పుడు తెలుసుకుందాం..  ఒకప్పుడు ఉలవలను తినడానికి ఎక్కువగా ఇష్టపడరు.. అయితే ఇప్పుడు మాత్రం ఉలవచారు పేరుతో ఎక్కువ మంది తీసుకుంటున్నారు. విందు, వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు.
 ఉలవల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలుతో పాటుగా చాలా అధిక బరువును ఇట్టే కరిగిపోతుందని అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత తో బాధ పడేవారు ఉలవలను తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతాయి. కడుపు లో వాతమును త్వరగా తగ్గిస్తుంది. ఉలవల్లో ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తం లోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణ లో ఉంటాయి.
మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.. ఈ ఉలవల్లో ఆకలిని పెంచే గుణం ఎక్కువగా ఉంటాయి. దానిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. ఉలవలు, బియ్యాన్నీ సమంగా తీసుకొని జావ మాదిరిగా చేసుకొని పాల తో కలిపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది.. పిల్లలు ఎదుగుతున్న సమయం లో వీటిని తినిపిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. ఇంక ఆలస్యం ఎందుకు ఎంతో రుచి కరమైన ఈ ఉలవలను మీరు ఆహారంలో చేర్చుకోండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: