సూర్యగ్రహణాన్ని సూటిగా చూసిన 15మందికి ఏం జ‌రిగిందో తెలుసా..?

Kavya Nekkanti

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. 

 

భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. ఇదిలా ఉంటే..  సూర్యగ్రహణాన్ని ఎటువంటి ఉపకరణం లేకుండా వట్టి కళ్లతో నేరుగా చూడటంతో 15మంది కంటిచూపు దెబ్బతింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. డిసెంబరు 26న ఆకాశంలో ఆవిష్కృతమైన సూర్యగ్రహణాన్ని 15మంది యువకులు వట్టి కళ్లతో సూటిగా చూశారు. 

 

దీంతో వారి కంటిలోని రెటీనా మాడిపోయిందని, కంటి చూపు బాగా దెబ్బతిందని ఇక్కడి ఎస్‌ఎమ్‌ఎస్ ఆస్పత్రి వైద్యుడు కమలేష్ ఖిలానీ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా వారి చూపు పూర్తిగా తిరిగి రావడానికి అవకాశాలు లేవని స్పష్టంచేశారు. అయితే గ్రహణ సమయంలో నేరుగా సూర్యుణ్ని చూడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సూర్యుడిలో ఉండే అతినీల లోహిత కిరణాల వల్ల కళ్లకు ప్రమాదం ఏర్పడుతుందని చెపుతున్నారు. అందువల్ల గ్రహణాన్ని చూడాలనుకునే ప్రజలు… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: