వ‌ర్షాకాలం ద‌గ్గు... ఈ చిట్కాల‌తో మ‌టుమాయం

Kavya Nekkanti
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జలుబు వేధిస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అసలు వదిలిపెట్టవు. పిల్లల విషయంలో ఇవి మరీ ఇబ్బంది పెడుతుంటాయి. స్కూల్లో ఒకరిని ఒకరు తాకడం, దగ్గరగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.


సీజనల్ చేంజెస్ వల్ల, వర్షాల వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇక వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల.. వెంటనే దగ్గు, జలుబు పట్టుకుంటాయి. దాంతో పాటు సైనస్, కఫం, గొంతునొప్పి ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ సీజన్ లో ముందుగా మనం వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు అందించే వాటిని తీసుకోవాలి.


- దీర్ఘకాలం దగ్గు వేధిస్తున్నప్పుడు సొంతవైద్యం పనికిరాదు. సిగరెట్ల అలవాటుంటే మానేయాలి. దగ్గును నెగ్లెక్ట్ చేస్తే మరిన్ని సమస్యలు రావొచ్చు.


- ద‌గ్గు పూర్తీగా తగ్గేవరకు రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.


- ఒక టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.


- 2 లేదా 3 తులసి ఆకులను నీళ్లలో కలిపి కాసేపు ఉడకపెట్టాలి. నీళ్లు చల్లారిన తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.


- ఒక టీ స్పూన్ సొంఠి, టీ స్పూన్ మిరియాల పొడి, అయిదారు తులసి ఆకులు తీసుకుని నీటిలో కలిపి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడబోసి ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తాగితే.. దగ్గు తగ్గుతాయి.


- దగ్గు వచ్చిందంటే ఏ దగ్గుమందో మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని వాడటం చాలామందికి అలవాటే. కాని ఇది ఎంతమాత్రం మంచిది కాదు.


- దగ్గులో పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు.. రెండూ ఉండొచ్చు. ఈ తేడా గుర్తించటం చాలా అవసరం. ఒక రకమైన దగ్గుకి ఇంకో రకమైన మందు వాడితే సమస్య తగ్గడం మాట అటుంచి మరింత ఎక్కువ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: