అంజీరాతో ఆరోగ్యం !

Seetha Sailaja
ఫల సంపదలో అంజీరాకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఇందులోని అద్భుత గుణాలు తెలుసుకుంటే మనం చాల మటుకు మందులు వేసుకునే పరిస్థితి లేకుండా చేసుకోవచ్చు. అంజీరా పుట్టినిల్లు అరేబియన్ దేశం. అంజీర్ పండును కేకులు, జాం, జెల్లీ, జూస్ లు తయారు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. 

అంజీరలో పీచు పదార్ధం అధికంగా ఉంది. ఈ పండులో విటమిన్ ఎ, బి1, బి2, కాల్షియం, ఫాస్పరస్, ఇరన్, మాంగనీసు, సోడియం, పొటాషియం, మినరల్సు చాలా అధికంగా ఉంటాయి.
కేవలం అంజీర పండు మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా చాలా ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తల పరిశోధనల అనంతరం అంజీర పండు కంటే కూడా ఆకుల్లో పోషకాలు అత్యంత అధికంగా ఉన్నాయని కొన్ని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. 

ఎండు అంజీరాలో మనకు అత్యంత అవసరమైన ఐరన్ పుష్కలంగా ఉంది. మన శరీరంలోని ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీరలో అధిక మోతాదులో ఉంది. ముఖ్యంగా ఈ అంజీరా పండ్లు షుగరు పేషెంట్లకు దివ్య ఔషదంగా చెపుతారు. మన శరీరంలోని   ఇన్సులిన్ మోతాదును  క్రమబద్ధీకరించుటలో వీటి పాత్ర చాల ఎక్కువ. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో అంజీరా ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఆకులలో లభిస్తుంది.

అంజీరా పండ్లను తినడం వల్ల మన జీర్ణ శక్తి మెరుగు పడటమే కాకుండా మన పేగులలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వీటిలో పొటాషియం విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను తరుచూ తినే వారికి రక్త పోటు సమస్యలు ఉండవు అని వైద్యులు చెపుతున్నారు. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా మన దృష్టి లోపాలను సవరించే శక్తి కూడ ఈ అమ్జీరాకు ఉంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న ఈ అంజీరా పండును ఎంత తింటే అంత ఆరోగ్యం అని అంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: