గురువుగారి సందేశం

Durga
          ఒక రోజు గురువుగారు తన ప్రియశిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్లాడు. నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోయాడు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు. అందులో ఒక్కటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్దమొక్క, మూడవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుడి ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు.             ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ  లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవదానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దానిని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు.       ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నిచినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు ‘‘చూడు నాయనా’’ మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం, మొక్కై వంగనిది మానై వంగునా?        అన్న సామెత ఈ విదంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు’’ అన్నాడు. గురువుగారు. ఈ కథలోని నీతి :మనలో మొలచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: