బుడుగు: పిల్లలపై ఈ స్థాయిలో ఒమిక్రాన్ ప్రభావం .. జాగ్రత్త సుమీ..!!

N.ANJI

ప్రస్తుతం దేశ వ్యాప్తం కరోనా వైరస్‌తోపాటు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా అధికంగా ఉంది. రోజురోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. పెద్దవాళ్లలో కంటే.. చిన్నపిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీలోని చిన్నపిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్యలోనే దాదాపు 7 మంది చిన్నారులు ఒమిక్రాన్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే.. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యం వహించొద్దని, ఇప్పటికే చిన్న పిల్లల్లో కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.


ఇప్పటివరకు 5 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ పంపిణీ విస్తృతంగా జరగటం లేదు. దీంతో ప్రమాదం ఎక్కువగా ఉందని, వైరల్ లక్షణాలు పెద్దవాళ్లలో కనిపించకపోయినా.. ఇబ్బందులు తక్కువగా ఉంటాయన్నారు. కానీ చిన్న పిల్లల్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయన్నారు. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుత సమయంలో పిల్లలను బయటికి తీసుకు రావొద్దని, ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచాలని పేర్కొన్నారు. బయటికి తీసుకొస్తే మాస్క్, శానిటైజర్ వాడుతూ ఉండాలని పేర్కొన్నారు. ఇంట్లో వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. మీకు వైరస్ సోకితే.. అది మీ పిల్లలకు సోకుతుందని విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేయాలన్నారు.


గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,71,202 కరోనా కేసులు నమోదు కాగా, 314 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 15 లక్షల 50 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో ఒమిక్రాన్ కేసులు 7,743 ఉన్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన వారు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోందన్నారు. వీలైనంతవరకు ఇంటి నుంచి బయటికి రావొద్దని, కరోనా నిబంధనలు అన్ని పాటించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: