స్టోరీ టైమ్ : సరైన చోటు ఉంటేనే రాయికి కూడా విలువ !
శ్యామా అక్కడ నుండి ఒక రాయితో బయటకు వచ్చి, ముందుగా ఆ రాయిని కూరగాయలు అమ్మేవాడికి చూపించగా, చిన్న రాయిలా ఉందని, వంద రూపాయలు ఇవ్వగలను అన్నాడు. ఒక పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లగా ఇది ప్రత్యేకమైన, విలువైన రాయి కాదంటూనే నేను మీకు వెయ్యి రూపాయలు ఇవ్వగలను అని చెప్పాడు. ఇప్పుడు కిరాణా షాపుకు చేరుకుని అతనికి రాయి చూపించాడు. ప్రత్యేక రాయి కాకపోయినా, కావాలంటే పదివేలు ఇస్తాను అన్నాడు దుకాణదారు. అది విన్న శ్యామా మొహంలో కొంత సంతోషం కనిపించింది. అయినా నా అప్పు మొత్తం తీరకపోతే అమ్మి ఏం చేయాలి ? అని ఆలోచించడం మొదలు పెట్టాడు.
శ్యామా ఇప్పుడు తనకు తెలిసిన కుమ్మరి దగ్గరకు వెళ్లాడు. అతను ప్రకాశవంతమైన నీలం రాయిని చూసి ఇలా అన్నాడు. ఇది ఒక ప్రత్యేక రత్నం కూడా కావచ్చు. దీని కోసం నేను మీకు లక్ష రూపాయల వరకు ఇవ్వగలను. అది విన్న శ్యామా అది కాకపోతే దాని ధర ఇంతకంటే ఎక్కువే అనుకున్నాడు. దీంతో నా రుణం తీరిపోతుందని భావించి ఆ రాయితో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈసారి శ్యామా స్వర్ణకారుని దగ్గరకు వెళ్లి ఆ రాయిని చూసి స్వర్ణకారుడు చాలా విలువైనదిగా కనిపిస్తోంది అని చాలా తర్జనభర్జనల అనంతరం ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర విన్న శ్యామా ఆనందంతో ఎగిరి గంతులేసాడు. అయితే ఇంతకంటే విలువైనది కావచ్చు లేదా కాకపోవచ్చు అనుకుంటూ ఆ అమూల్యమైన రాయితో వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఇది మామూలు రాయి కాదని ఇప్పటికి అతనికి అర్థమైంది. వజ్రాల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి ఇది మీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది చాలా విలువైనది. వ్యాపారి ముఖం చూసి శ్యామాకి అర్థమైంది నేను ఇప్పుడు రాయితో సరైన ప్రదేశానికి వచ్చానని.
మీరు దీనికి ఎంత చెల్లిస్తారు? అడిగాడు శ్యామా. పది లక్షల రూపాయలు వ్యాపారి చెప్పాడు. ఇప్పటికి శ్యామాకి రాయి విలువ అర్థమైంది. పది కాదు ఇరవై లక్షలు తీసుకుంటాను. అంగీకారమైతే చెప్పండి? అని అన్నాడు. కొంత చర్చ తర్వాత చివరకు ఆ రాయి పదిహేను లక్షలకు అమ్ముడుపోయింది.