బుడుగు: ఆ కాలం పోయింది.. ఇప్పుడిలా చదివిస్తేనే పిల్లలకు చదువు..!

N.ANJI
ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా తమ పిల్లలు ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. దాని కోసం స్పెషల్ కోచింగ్‌లు, ట్రైనింగ్‌లు ఇప్పిస్తుంటారు. అయితే అన్ని రకాల సౌకర్యాలు కల్పించినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు పిల్లల్లో ఎలాంటి మార్పు ఉండదు. వారి జీవితం మందకోడిలా సాగిపోతుంటుంది. అయితే అలాంటి పిల్లలు చదవాలంటే ఎలాంటి రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేస్తే తమ పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని తెగ ఆలోచిస్తుంటారు. పిల్లలను చదివించడానికి తల్లిదండ్రుల తమ టైంను కేటాయించి.. ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతారు. ఏకాగ్రతతో చదువుకోవడానికి స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకుంటారు. అయినా వారి చదువులో మార్పు లేకపోతే తల్లిదండ్రులు ఎంతో దిగులు చెందుతారు.
ఈ విషయంపై వాస్తు నిపుణులు కొన్ని రకాల జాగ్రత్తలు చెబుతున్నారు. స్టడీ రూమ్‌లో కొన్ని మార్పులు చేసినట్లయితే వారు చదువుపై దృష్టి సారిస్తారని పేర్కొంటున్నారు. వాస్తు ప్రకారం.. పిల్లలు చదువుకునే గదిలో కొన్ని మార్పులు చేయాలని, అప్పుడే వారు మంచిగా చదువుకుంటారని వారు చెబుతున్నారు. వాటికి సంబంధించిన కొన్ని వివరాలను వారు వెల్లడించారు. పిల్లలు ఏకాగ్రతతో చదవాలంటే వాస్తు మార్పులు చేయాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. గదిలోని కొన్ని ముఖ్యమైన వస్తువులను సరైన దిశలో పెడితే చాలని వారు చెబుతున్నారు. స్టడీ రూం అంటే ప్రపంచ పటాలు, భూగోళం, ఆల్ఫాబెట్స్ కనిపిస్తుంటాయి. వీటిని ప్రతి రోజూ చూస్తుండటం వల్ల పిల్లలకు వాటిపై కొంతమేరా అవగాహన కలుగుతుంది. అయితే వాస్తు ప్రకారం చూస్తూ.. ఇలాంటి మ్యాపులు ఈశాన్యం దిశలో అతికించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే పిల్లలు మంచిగా చదువుతారని, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి వీలుకలుతుందన్నారు.
ఫోటో ఫ్రేమ్‌లు పిల్లల గదికి పశ్చిమ దిశలో ఉంచాలన్నారు. అలాగే గోడకు ఆకుపచ్చ (గ్రీన్) రంగు పెయింట్ వేయించాలన్నారు. ఆకుపచ్చ రంగును చూస్తే పిల్లలు రిఫ్రెష్ అవుతారని, తమలోని ఒత్తిడిని తగ్గించి మంచిగా చదువుతారని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివినట్లయితే అది మెదడులో బాగా నిక్షిప్తమవుతుందన్నారు. ఆకుపచ్చ రంగు తాజాదనానికి, శాంతి, అభివృద్ధిని సూచిస్తుందని వారు పేర్కొన్నారు. బాత్రూమ్ తలుపు బెడ్స్ ముందు ఉండొద్దని, అలాగే మంచానికి ముందు అద్దాలు పెట్టొదన్నారు. స్టడీ రూమ్‌లో దక్షిణం లేదా తూర్పు వైపు బెడ్స్ ఉండాలన్నారు. అలాగే ఆ రూమ్‌లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు (టీవీ, మొబైల్స్) ఉంచొద్దన్నారు. అప్పుడే పిల్లలు హాయిగా చదువుతారని, మంచిగా నిద్రపోతారని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: