చంటి పిల్లలకు దద్దర్లు వస్తే ఏం చేయాలో తెలుసా ?

Vimalatha
చంటి పిల్లలకు దద్దర్లు వస్తే ఏం చేయాలో తెలుసా ? చంటి పిల్లలకు తుంటి పై దద్దుర్లు రావడం సాధారణ సమస్య. ఇది చర్మ అలెర్జీలు మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. దీనినే చర్మ శోథ అంటారు. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు వస్తున్న దద్దుర్ల గురించి ఆందోళకు గురవుతుంటారు. దద్దుర్లు చిన్న పిల్లలలో ఒక రకమైన ఇన్ఫెక్షన్. పిల్లల తుంటి భాగంలో ఎక్కువగా దద్దుర్లు వస్తాయి. పిల్లల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. మూత్రవిసర్జన లేదా ప్రేగు కదలికల తర్వాత శిశువు శరీరంపై తేమ బాగా ఎండిపోవడం వాళ్ళ కూడా ఇది జరుగుతుంది. అలా దద్దుర్లు ఉంటే శిశు వైద్యుని సంప్రదించడం మంచిది.
చర్మాన్ని రుద్దకండి : దద్దుర్లు ఉంటే టిష్యూ పేపర్‌ని ఉపయోగించండి. తేమను పొడిగా చేయడానికి గుడ్డతో రుద్దవద్దు. పత్తి ఉపయోగించండి. డైపర్లు వేయకండి. దీని కారణంగా దద్దుర్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
 కొబ్బరి నూనె : కొబ్బరి నూనెను శిశువు శరీరానికి పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దద్దుర్లు నయం చేయడంలో సహాయ పడతాయి. అయితే డాక్టర్ల సలహా తప్పనిసరి అని మర్చిపోకండి.
హెచ్చరిక : దద్దుర్లు ఉన్న ప్రాంతాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. మంద పాటి కాటన్ వస్త్రాన్ని ఉపయోగించవద్దు. పత్తితో తుడవండి. అలాగే సబ్బును ఉపయోగించడం మానుకోండి.

కాబట్టి పిల్లలకు దద్దుర్లు వచ్చినప్పుడు ఆందోళన పడకండి. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని వైద్యుల సలహా మేరకు చేస్తే సరిపోతుంది. చిన్న పిల్లలకు ఇలాంటి దద్దర్లు వచ్చినప్పుడు వైద్యులు సైతం కొన్ని మందులు వాడమని సలహా ఇస్తారు. వాటిని వాడితే సరిపోతుంది. ఇకపై చంటి పిల్లల ఒంటిపై దద్దుర్లు వచ్చినా నో టెన్షన్ !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: