బుడుగు: పిల్లలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే..!?

N.ANJI
శీతాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో సాధారణంగా పెద్దవారికే ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. సీజనల్ వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే అంటువ్యాధుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. శీతాకాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికి పిల్లల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ వ్యాధులకు కొన్ని కారణాలు ఉన్నాయి. వీటితో పిల్లలను ఎలా రక్షించుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం.
శీతాకాలంలో దోమల ద్వారా తలెత్తె ప్రధాన వ్యాధి. టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా, మలేరియా, మెనింజైటిస్. ఈ వ్యాధులు దోమ కాటు వల్ల వస్తాయి. ఈ విష జ్వరాలు ఎంతో డెంజర్. వీటి నుంచి పిల్లలు కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. పిల్లలకు విష జ్వరాలు వచ్చినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, అలసట, చలి, వికారం వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు నెగ్లెట్ చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు తెలిపిన సూచనలు, సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి.
దోమల నివారణకు చర్యలు..
శీతాకాలంలో దోమ బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త, డ్రైనేజీ వంటివి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే దోమల వ్యాప్తి జరగదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి కిటికీలకు దోమ తెరలు వాడాలి. పిల్లలకు చేతులు, కాళ్లు కప్పి ఉండే దుస్తువులు ధరింపజేయాలి. పిల్లలు పడుకునేటప్పుడు దోమ తెరలు పెట్టాలి. ఒడోమస్ లోషన్ రాయడం వల్ల దోమలు కుట్టవు. స్కిన్ కేర్ కూడా చూసుకోవాలి. సబ్బులతో స్నానం చేయించడం మానుకోవాలి. సబ్బులతో స్నానం చేయించడం వల్ల చర్మం పగిలిపోతుంది. బాడీ లోషన్లు వాడాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే.. మీ పిల్లలకు ఎలాంటి వ్యాధులు, సమస్యలు దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: