బాల భారతం: రేపటి తరానికి శాపంలా సిగరెట్?

praveen
మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కు కారకం.. ఈ బోర్డు ఎక్కడ చూసినా దర్శనమిస్తూ వుంటుంది.. ఇక మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం మద్యపానం ధూమపానానికి  జనాలు రోజురోజుకు దగ్గరవుతున్నారు తప్ప దూరం మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా ధూమపానం.. అదే సిగరెట్ తాగడం.. ఇక సిగరెట్ నేటి రోజుల్లో నయా ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఈ ట్రెండ్ లో నేటి రోజుల్లో యువత కొట్టుకుపోతుంది. అప్పుడు అప్పుడే మీసాలు మొలుస్తున్న పోరగాని నుంచి.. సిగరెట్ తాగడం మొదలు అవుతుంది.

 ఒకప్పుడు సిగరెట్ తాగడాన్ని ఒక బూతు పని గా చూసేవారు.. అంతేకాదు ఇక యువత సిగరెట్ తాగాలి అనే ఆలోచన వచ్చినా కూడా భయపడిపోయారు.. కానీ ఈ రోజుల్లో  కాలం తీరు మారడమే కాదు మనిషి తీరు కూడా మారిపోతుంది.. ఎందుకంటే ఒకప్పుడు బుద్ధిగా చదువుకునే విద్యార్థులు స్కూల్ దశ నుంచే సిగరెట్లు మందు తాగడం మొదలు పెడుతున్నారు. అయితే చేస్తుంది తప్పు పని అని అనుకోవడం లేదు అది ఒక నయా ట్రెండ్ అంటూ భావిస్తున్నారు. కొంతమంది స్కూల్ పోరగాళ్లు సిగరెట్ తాగుతూ ఉంటే.. ఇక కాస్త కాలేజీ కి వస్తే చాలు వాళ్ల కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరని నేటి రోజుల్లో యువత భావిస్తున్నారు.

స్కూల్ రోజుల్లోనే సిగిరెట్ తాగామ్.. ఇప్పుడు కాలేజీ కి వచ్చాం.. చాలా పెద్దవాళ్ళం అయిపోయామ్.. ఇప్పుడు కూడా సిగరెటేనా  కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దాం.. సిగరెట్ తో పాటు గంజాయి కూడా తాగితే పోలా.. ఇది నేటి రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లల ఆలోచన. తల్లిదండ్రులు పిల్లలపై ఎంత నిఘా పెడుతున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నేటి రోజుల్లో స్కూల్ దశ నుంచి పిల్లలు వేస్తున్న ప్రతి అడుగూ తప్పటడుగు అవుతోంది. ఇలా రేపటి తరానికి నేటి రోజుల్లో సిగరెట్ ఒక శాపం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: