పినాకిల్ బ్లూమ్స్ : నేటితరం మదర్ తెరిస్సా ఆమె?

praveen
పిల్లలు పుట్టినపుడు తల్లి దండ్రుల మోకాల్లో కనిపించే ఆనందం ఎన్ని కోట్లు పెట్టిన కూడా దొరకదు అని చెప్పాలి.. అదే పుట్టిన పిల్లలు రోజులు గడుస్తున్న కొద్దీ ఎదుగుదల క్షీణిస్తే.. ఇక ఆ తల్లిదండ్రుల్లో కనిపించే బాధ కూడా అదే రీతిలో ఉంటుంది. కడుపున పుట్టిన వాడు కళ్లెదురుగా బుద్ధిమాంద్యంతో బాధపడుతూ ఉంటే పుట్టెడు దుఃఖాన్ని మనసులో దాచుకుంటుంది ఆ తల్లి.. ఇక పిల్లలే ప్రాణం అనుకున్న ఆ తండ్రి కి పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడుతూ ఉంటే.. వాళ్ల భవిష్యత్తు శూన్యం అయిపోతుందేమో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఇలా నేటి రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల సరిగా ఉండదు. బుద్ధిమాంద్యత, వినికిడి లోపం, మానసిక లోపం లాంటి సమస్యలతో ఇక పిల్లలు బాధపడుతూ ఉంటే కొండంతబాధతో ఆసుపత్రుల చుట్టూ తిరగడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు తల్లిదండ్రులు.

 అలాంటి తల్లిదండ్రులు అందరి దుఃఖాన్ని దూరం చేసేందుకు.. బుద్ధిమాంద్యం,మానసిక లోపం, వినికిడి లోపం లాంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు  నేను ఉన్నాను అంటూ ఒక అమ్మ ముందుకు వచ్చింది.. కన్నతల్లి కాకపోయినా.. కంటికి రెప్పలా ఎంతోమందిని కాచుకుంది... పేగుబంధం కాకపోయినా సొంత పిల్లల్లాగానే ఎంతోమందిని చేరదీసింది. ఇలా ఎంతో మంది చిన్నారులకు బంగారు భవిష్యత్తును కలిగిస్తూ ఒక గొప్ప మాతృమూర్తి గా మారిపోయింది ఆమె. ఆమె ఎవరో కాదు డాక్టర్ శ్రీజ సరిపల్లి.

నేటి రోజుల్లో సమాజం కోసం ఆలోచించే వారు చాలా తక్కువ మందే.. ముఖ్యంగా కోట్లకు అధిపతి అయిన వారు సమాజం గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు.. కానీ కోట్లకు అధిపతి అయిన తాను ఒక మానవత్వం ఉన్న మనిషినే అన్న విషయాన్ని ఆమె నిరూపించింది. ఎంతో మంది చిన్నారులకు తల్లిగా మారిపోయింది.  ఆటిజం సమస్యకు వివిధ రూపాల్లో వైద్యం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తన కుమారుడికి వినికిడి లోపం నయం చేసేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా ఆమె.. ఏ తల్లి కూడా తనలాగా బాధపడకూడదు అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను స్థాపించింది .  ఆటిజం సమస్యతో బాధపడుతున్న పిల్లలకు సేవలు అందించడం వైద్యం అందించడం ద్వారా ఒకరకంగా తిరిగి చిన్నారులకు పునర్జన్మ ను ఇస్తుంది ఆ మాతృమూర్తి. ఇలా నేటి రోజుల్లో ఆటిజం తో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించేందుకు నిరంతరం కృషి చేస్తూ పేద మధ్యతరగతి పిల్లలందరికీ బంగారు భవిష్యత్తును ఇచ్చే నేటి జనరేషన్  మదర్ తెరిస్సా  గా మారిపోయారు శ్రీజ రెడ్డి సరిపల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: