బాల భారతం: ఒళ్ళు అలుస్తుందా...? చెమట పడుతుందా...?

VAMSI
నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాట అందరికీ తెలుసు. కానీ వారిని చూసి భారత దేశం గర్వించేలా చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. పిల్లలను స్వేచ్చగా ఎదగనివ్వాలి. కానీ చాలా మంది పేరెంట్స్ క్రమశిక్షణ పేరిట వారితో కటువుగా ప్రవర్తిస్తున్నారు. మంచి మార్కులు వచ్చే తీరాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. పొద్దున లేచింది మొదలు స్కూల్ కి రెడీ అవ్వడం హడావిడిగా పరుగులు తీయడం , సాయంత్రం ఇంటికి రావడం మళ్ళీ ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు అంటూ రాత్రి వరకు చదువుతూ కుస్తీలు పడటం చేస్తుంటారు. మళ్ళీ హోమ్ వర్క్ లు గట్రా ఎలానో ఉండనే ఉంటాయి. ఇలా చాలా మంది చిన్నారులు యాంత్రిక జీవితం లోకి నెట్టబడుతున్నారు.
దీని వలన అలసిపోయిన వారి మనసు మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. ఒక పక్క స్కూల్, ట్యూషన్ ఇలా అటు తిరిగి ఇటు తిరిగి శరీరం కూడా బాగా అలసిపోతుంది. ఇది వాడి మెదడుపై ఎంతగా ప్రభావం చూపుతుందో తెలిసి కూడా అందరూ పిల్లలతో పాటే మన పిల్లలు కూడా అని సరిపెట్టుకుంటున్నారు. ఇంకొంతమంది పిల్లల పరిస్థితి మరోలా వుంటుంది. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగ రీత్యా బిజీగా ఉండటం వలన పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. దాన్ని అలుసుగా తీసుకుంటున్న పిల్లలు పేరెంట్స్ అటు వెళ్ళగానే వారికి నచ్చిన విధంగా వారు వుంటున్నారు. ఫ్రెండ్స్ తో ఎక్కువగా తిరగడం, చదువుపై అస్సలు కొద్దిగా కూడా ధ్యాస పెట్టకుండా వారి ధోరణిలో వారు ఉండటం జరుగుతోంది.
ఇవన్నీ తెలిసి కూడా కొందరు పేరెంట్స్ తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టే సమయం లేక బ్రతుకు జీవనం కోసం పరుగులు తీస్తున్నారు. మరికొందరి పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే వారికి ఇంట్లో వారు చేసే అతి గారాబం వలన పాడైపోతున్నారు. అడిగినవన్ని కొనిస్తుండటం, నచ్చినవన్ని చేసుకునే స్వేచ్చ వారికి ఇవ్వడం వలన భవిష్యత్తు గురించి పక్కన పెట్టి ప్రస్తుత జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సినిమాలు చూడటం లేదా ఆటలు ఆడుతూ, నచ్చింది చేస్తూ ఉండిపోవడం వంటివి చేస్తున్నారు. పై మూడు రకాల పద్ధతులు చాలా మంది పిల్లల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఇటువంటి పిల్లల విషయంలో పేరెంట్స్ అప్రమత్తం అవ్వకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: