బాల భార‌తం : యూ నో మావోడికి తెలుగు తెలియదు అండి!

Divya
మన మాతృభాష తెలుగు.. ఈ విషయం ఈ కాలంలో ఎంతమందికి గుర్తుంటుంది చెప్పండి.. ఇంగ్లీష్ అనే వ్యామోహంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన జీవితంలో ఒక భాగం అవ్వాలి తప్ప ఇంగ్లీష్ భాష మన జీవితం కాకూడదు.. తెలుగు తీపి జ్ఞాపకాలను మర్చిపోయి తల్లిదండ్రులు కూడా మా వాడికి తెలుగు తెలియదండి..తెలుగు రాదండి..అంటూ ఇంగ్లీష్ పలుకులు పలుకుతున్నారు. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం పేరిట పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు తప్ప, తెలుగు భాష నేర్పించరు సరికదా మాతృ భాష యొక్క గొప్పతనాన్ని కూడా ఈ మధ్య పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా చెప్పడం లేదు.. అంటే ఎంత విచారణ పరిస్థితి లో మనం అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని , ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు భాషను తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే. అంటే ఇది ఒక రకంగా పిల్లల భవిష్యత్తుకు పునాది అని చెప్పవచ్చు.. అయితే ఇంగ్లీషు, తెలుగు రెండు కలిపి నేర్చుకుంటేనే పిల్లలకు తెలుగు మాతృత్వం యొక్క గొప్పదనము , భవిష్యత్తులో ఇంగ్లీష్ యొక్క ఉపయోగము రెండు అర్థమవుతాయి. ఇంగ్లీష్ అనే భాష పేరిట తల్లిదండ్రులు కూడా పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నలుగురిలో గొప్ప అని అనిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకు విలాసవంతమైన లగ్జరీ జీవితాన్ని గడిపేలాగ అలవాటు చేస్తున్నారు.

అడిగిన డబ్బు ఇవ్వడం, సెల్ఫోన్లను, కంప్యూటర్లను పిల్లలకు ఇప్పటి నుంచే పరిచయం చేయడం, వాటిని పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారా లేక దుర్వినియోగం చేసుకుంటున్నారా అనే  ఈ విషయాలపై ఏమాత్రం ఆలోచన లేకుండా తల్లిదండ్రులు వారి వారి పనుల్లో బిజీ అయిపోతుంటే, పిల్లలు మాత్రం ఇష్టానుసారంగా తమ జీవితాలను తప్పుదోవ పట్టించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మరీ దారుణమైన సంఘటనలు అనగా చిన్న పిల్లల సైతం అత్యాచారానికి పాల్పడుతున్నారు..ఈ రోజులు చాలా అత్యంత దారుణంగా దరిద్రంగా మారిపోతున్నాయి.. తల్లిదండ్రులు ఇకనుంచి అయినా ముందు జాగ్రత్తతో మీ పిల్లలకు అన్ని విషయాలపై చక్కటి అవగాహన కల్పించడానికి కనీసం రోజుకు రెండు గంటలపాటు సమయాన్ని వారికోసం కేటాయించాలని మా మనవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: