బుడుగు: ఆ వయస్సు పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి..??
అయితే అలాగే కొనసాగితే యుక్త వయసులో కూడా అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. పిల్లలకు జంక్ ఫుడ్కి బదులుగా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, బాదం, ఆక్రోట్, వేరుశెనగ, వేయించిన శనగలు, బఠాణి లాంటి గింజలు, మొలకలు, ఉడికించిన గింజలు, మొక్కజొన్నలు మొదలైనవి స్నాక్స్ లాంటివి అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక.. పిల్లలకు వివిధ రకాల చాట్స్, సలాడ్లు, టిక్కీలు, కట్లెట్స్ చేయవచ్చునని అన్నారు. ఇక చపాతీలో గుడ్డు, పనీర్, చికెన్ లాంటివి చేర్చి రోల్స్ చేస్తుండాలని అన్నారు. అలా చేసి పెట్టడం వలన పిల్లలు ఇష్టంగా తింటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటి వల్ల ఆకలి తీరడమే కాకుండా పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలని సంవృద్ధిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇంట్లో ఇళ్లలో చేసినవైనా, బయటి నుండి తెచ్చినవైనా స్వీట్లు, నూనెలో వేయించిన పిండివంటలు, బిస్కెట్లు, చాక్ లెట్లు, బేకరీ ఫుడ్స్ వీలైనంత తక్కువగా పిల్లలకు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే ఈ చిరుతిళ్ళ వల్ల ఆరోగ్యానికి హానిచేసే సాచురేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక కెలోరీలు శరీరంలో చేరుతుందని చెబుతున్నారు. దాంతో చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.