బుడుగు: మాస్కులతో పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గుతోందా..??

N.ANJI
గత రెండు సంవత్సరాల నుండి కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకి రావడానికి భయపడుతున్నారు. ఇక ఇంటి నుండి బయటికి రావాల్సి వ‌చ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక పిల్లలను కూడా తల్లిదండ్రులు వారిని ఇంటి నుండి బయటికి తీసుకరావడం లేదు. వవ మహమ్మారి కారణంగా స్కూళ్లు మూత‌ప‌డ‌టంతో పిల్ల‌లు ఇంట్లోనే ఉంటున్నారు.
ఇక ఇరుగు పొరుగు పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డానికి కూడా బయటకి వెళ్లనివ్వడం లేదు. అంతేకాక.. వైర‌స్‌, బ్యాక్టీరియా కార‌ణంగా వ‌చ్చే ఫ్లూ, ఇత‌ర జ‌బ్బుల బారిన ప‌డడ‌టం త‌గ్గిపోయిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుందన్నారు. అయితే దీనివ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిపోయాక చాలా ర‌కాల వ్యాధుల‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీని పిల్ల‌లు పొంద‌లేక‌పోతున్నారని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.
అయితే ముఖ్యంగా చిన్న పిల్ల‌ల్లో వ‌చ్చే శ్వాస‌కోశ వ్యాధి రెస్పిరేట‌రీ సిన్సిటియ‌ల్ వైర‌స్ ( RSV ) విష‌యంలోనూ వైరాల‌జిస్టులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక క‌రోనాకు ముందు ఇత‌ర సీజ‌న‌ల్ వ్యాధుల‌తో పోలిస్తే ఈ RSV బారిన పిల్ల‌లు ఎక్కువ‌గా ప‌డేవారని నిపుణులు తెలిపారు. అంతేకాదు.. క‌రోనాకు ముందు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో ఏటా 30 వేల‌కు పైగా చిన్నారులు ఈ RSV బారిన ప‌డేవారు అని అంచ‌నా వేస్తున్నారు. ఇక వీరంతా ఐదేళ్ల లోపు చిన్నారులే కావ‌డం గ‌మ‌నార్హం అనే చెప్పాలి.
అంతేకాక.. క‌రోనా కార‌ణంగా మాస్కులు ధ‌రిస్తూ భౌతిక దూరం పాటించ‌డం వ‌ల్ల గ‌త రెండేళ్లుగా ఈ వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డం లేదంట. ఇక ఈ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధ‌క శ‌క్తిని పిల్ల‌లు పొంద‌లేక‌పోతున్నారు. అయితే పిల్ల‌ల్లో ఈ వైర‌స్‌ను ఎదుర్కొనే అంత ఇమ్యూనిటీ ఉండ‌దు కాబ‌ట్టి క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిన త‌ర్వాత‌ ఈ RSV మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని నాటింగ్‌హామ్ యూనివ‌ర్సిటీలో వైరాల‌జీ విభాగ‌ ప్రొఫెస‌ర్ విలియం ఐర్వింగ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: