బుడుగు: రెండేళ్ళ పిల్లలకి మాస్కులు వేయొచ్చా..?

N.ANJI
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ విపత్కర సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రెండేళ్ళ కన్నా ఎక్కువ వయసున్న పిల్లలు మాస్క్ వేసుకోవడం సురక్షితమేనని అంటున్నారు.
ఇక రెండేళ్ళ కంటే తక్కువ వయసుంటే మాత్రం మాస్క్ వేసుకోకూడదని అంటున్నారు. ఎందుకంటే వీరు సఫొకేట్ అయిపోయే రిస్క్ ఎక్కువ. అలాగే, స్పృహ లో లేకపోయినా.. లేదా తమంతట తాము ఏ ఫేస్ కవరింగ్ నీ తీసుకోలేని స్థితిలో ఉన్నా కూడా మాస్క్ వేసుకోకూడదని అన్నారు. అయితే ఈ మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ వయసున్న పిల్లలు పెద్ద వాళ్ళలానే మాస్క్ వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. అసలు మాస్క్ ధరించవలసిన వయసుని రెండేళ్ళ నుండి ఐదేళ్ళకి ఎందుకు మార్చారు. ఎందుకో ఒక్కసారి, పిల్లలు మాస్క్ హైజీన్ పాటించకపోయినా, సరదాగా మాస్క్ కిందకీ పైకీ లాక్కుంటూ ఆడినా వైరస్ సోకే రిస్క్ ఎక్కువవుతుంది. అయితే, ఐదేళ్ళు, ఆ పైన వయసున్న పిల్లలు సూచనలని అర్ధం చేసుకోగలుగుతారు. ఇక ఈ మార్గదర్శకాల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి కొవిడ్ ట్రీట్మెంట్ లో భాగంగా రెమిడిసివర్  ఇవ్వకూడదని అన్నారు. అయితే ఈ ఇంఫెక్షన్ ని ట్రీట్ చేయడానికి యాంటీ మైక్రోబియల్స్‌‌ని ఇవ్వడం కూడా డీజీహెచ్ఎస్ నిషేదించిందన్నారు.
అయితే కొవిడ్ 19 లాంటి వైరల్ ఇంఫెక్షన్స్ రాకుడా ప్రివెంట్ చేయలేవని అన్నారు. ఇక వచ్చాక క్యూర్ చేయలేవు అని అన్నారు. ఇక బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్ కూడా ఉందని బలమైన అనుమానం కానీ, ఎవిడెన్స్ కానీ ఉంటే అప్పుడు యాంటీ మైక్రోబియల్స్ ఇవ్వచ్చు అని మార్గ దర్శకాల్లో వెల్లడించారు. అంతేకాక ఆర్గన్ డిస్‌ఫంక్షన్ జరిగితే ఆర్గన్ సపోర్ట్ అవసరం కావచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: