బుడుగు: పిల్లలకి కరోనా వ్యాక్సిన్‌ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..!

N.ANJI
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారీ బారినపడకుండా ఉండేందుకు దేశంలో 2 నుండి 18 ఏళ్ల పిల్లలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే పెద్దవాళ్లలో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొద్ది పాటి లక్షణాలు మాత్రమే కనబడుతున్నాయి. అదేవిధంగా పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు.
ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు అక్కడ పిల్లలకి కూడా వ్యాక్సిన్ వేస్తున్నట్లు కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి అని వెల్లడించారు. పెద్దల్లో కనిపించే లక్షణాలు పిల్లల్లో కూడా ఉంటున్నాయని ముఖ్యంగా వాక్సినేషన్ వేయించుకున్న వెంటనే పిల్లల్లో ఇబ్బందులు వస్తున్నట్లు చెప్పారు. అయితే ఎటువంటి సీరియస్ లక్షణాలు లేవని చెప్పారు. 16 నుంచి 25 ఏళ్ల మధ్య వాళ్ళలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో కూడా ఉన్నాయని చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ చెప్పడం జరిగింది.
వ్యాక్సిన్ కారణంగా ఇన్ఫెక్షన్ రేట్ పిల్లల్లో తగ్గుతుందని వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కరోనా బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్ సహాయ పడుతుందని డాక్టర్లు అంటున్నారు. వ్యాక్సిన్ కారణంగా సురక్షితంగా ఉండొచ్చని వ్యాక్సిన్ బాగా ప్రొటెక్ట్ చేస్తుందని డాక్టర్లు అంటున్నారు అదే విధంగా వ్యాక్సిన్‌తో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, శుభ్రతగా ఉండాలని, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా సురక్షితంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు పెద్దగా ఇబ్బందికరమైన లక్షణాలు కనబడటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సింగ్ చేయించుకోవడం చాలా అవసరం. చాలా మంది వ్యాక్సిన్ మీద అనేక అనవసర సంభాషణలు చేస్తున్నారు. టీకా వెయించుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: