తిమ్మాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆయన కొన్ని పశువులతోపాటు కుక్కను, ఒక గాడిదను పెంచుచున్నాడు. రామయ్య విరామ సమయంలో ఇంటిముందు కూర్చునప్పడు కుక్క తోక ఆడిస్తూ, గంతులు వేస్తూదాని ముందుకాళ్లు రెండు ఒడిలో పెట్టి అతని చేతులు నాకుతూ, రామయ్య ఒడిలో పెట్టి అతని చేతులు నాకుతూ, రామయ్యను సంతోషపెట్టేది.
రామయ్య ఎక్కడికి వెళ్లినా దానిని వెంటతీసుకొని వెళ్లేవాడు, అది చూసి గాడిద ఓర్వలేకపోయింది. తనుకూడా ఎలాగైనా యజమాని అప్యాయత సంపాదించాలని నిశ్శయించుకొన్నది.
మరునాటి సాయత్రం రామయ్య ఇంటిముందు కూర్చొని విశ్రాంతి తీసుకొంటున్నాడు. ఇదే మంచి సమయమని తలచి గాడిద మహా సంతోషంతో పెద్దగా అరుస్తూ తోకాడిస్తూ పరుగుపరుగున వచ్చి రామయ్య ఒడిలో రెండుకాళ్లు పెట్టింది.
రామయ్య కంగారుతో భయంతో కేకలువేస్తూ వెనుకకుపడ్డాడు. క్షణంలో తేరుకొని దుడ్డుకర్రతీసి గాడిదను చావబాదాడు. ఈ కథలోని నీతి : ఎవరు చేయవలసిన పని వారే చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: