బుడుగు: చక్కెర ఎక్కువ తినే పిల్లల్లో కొత్త ముప్పు..!?

N.ANJI
చక్కర అనగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఇక కొంతమంది చిన్న పిల్లలు చెక్కరను ఎక్కువగా తింటుంటారు. ఇక చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడుతుందని ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాయ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
ఇక చిన్నతనంలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మజీవులు ఏర్పడతాయని, పెద్దయ్యాక చక్కర వినియోగాన్ని తగ్గించినప్పటికీ వాటి ప్రభావం కొనసాగుతుందని అధ్యయనం తేల్చి చెప్పింది. మానవుల, జంతువుల ప్రేగులలో పేరుకుపోయే ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్లను ఏర్పరుస్తాయని అధ్యయనం వెల్లడించారు. దీనితో పాటు శరీర రోగనిరోధక శక్తి తగ్గించి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఎలుకలపై జరిగిన ఈ అధ్యయనానికి అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాయానికి చెందిన థియోడర్ గార్లాండ్ నాయకత్వం వహించారు.
ఇక అధ్యయనం కోసం, మొత్తం ఎలుకలను నాలుగు గ్రూపులుగా విభజించారు. వాటిలో మొదటి గ్రూపుకు ఆరోగ్యకరమైన ఆహారం, రెండో గ్రూపుకు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించారు. ఇక మూడో గ్రూపుకు సాధారణ ఆహారాన్ని కొనసాగిస్తూనే క్రమం తప్పకుండా రన్నింగ్ వంటి వ్యాయామలను చేయించారు. నాలుగో గ్రూపుకు ఎక్సర్సైజ్ లేకుండా సాధారణ ఆహారన్ని కొనసాగించారు. ఇలా, దాదాపు మూడు వారాల పాటు తమ పరిశోధనను కొనసాగించారు.
అయితే మూడు వారాల తర్వాత అన్నింటికీ ఎటువంటి వ్యాయామం లేకుండా సాధారణ ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత వాటిని 14 వారాల పాటు ప్రయోగశాలలో పెట్టి అధ్యయనం చేయగా.. అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్న ఎలుకల్లో బ్యాక్టీరియా పరిమాణం గణనీయంగా పెరిగడమే కాకుండా, వాటిలో రోగనిరోధక శక్తి తగ్గిందని కనుగొన్నారు. అంతేకాక, ఈ రకమైన బ్యాక్టీరియా జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అధ్యయనంలో తేలింది. కాగా, ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీలో ప్రచురించబడ్డాయి.’

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: