బుడుగు :మీ పిల్లలకు 6 వ నెల తర్వాత నుంచి ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి..!
కొత్తిమీర ఆకులను సూప్, కిచిడిలో వేయవచ్చు. ఆకులను బాగా రుబ్బి ఆహారంలో చేర్చండి. ఎంత యాడ్ చేయొచ్చంటే.. శిశువు ఆహారంలో కొన్ని ఆకులు చేర్చవచ్చు. బేబీ ఫుడ్‌లో చేర్చే ముందు వాటిని మెత్తగా కత్తిరించండి. అలాగే కొత్తిమీరను ముందుగా నీటిలో శుబ్రపరిచండి. అలాగే ఈ కొత్తిమీర పెట్టడం వాళ్ళ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది క్రిమినాశక, యాంటీఆక్సిడెంట్.అలాగే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.6 నెలల తరువాత శిశువులకు గ్రీన్ ఏలకులు ఇవ్వొచ్చు. గ్రీన్ ఏలకుల పౌడర్‌ను ఖీర్, షీరా, పాన్ కేక్ లలో ఉపయోగించొచ్చు. శిశువు ఆహారంలో ఏలకులు ఎంత వేయాలి అంటే బేబీ ఫుడ్ లో 1/4 - 1/2 టీ స్పూన్ ఏలకుల పొడిని కలపొచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, శ్వాసకోశ అనారోగ్యాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో రాగి, ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తహీనతకు నిరోధించడానికి ఉపయోగపడతాయి.
7 నెలల తర్వాత శిశువు ఆహారంలో వాము జోడించవచ్చు. వాము పొడిని హెల్త్ మిక్స్, స్నాక్స్‌లో చేర్చొచ్చు. అలాగే పిల్లలకి వాము వాటర్ కూడా తాగించడం కూడా మంచిది. ఎంత పరిమాణంలో అంటే బేబీ ఫుడ్‌లో 1/4 నుంచి 1/2 టీస్పూన్ జోడించవచ్చు. వాము విరేచనాలు, దగ్గు, జలుబుకు సమర్థవంతమైన నివారణ. ఇది సులభంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది పిల్లలలో పేగు పురుగులను నివారించడానికి సాయపడుతుంది