బుడుగు: పిల్లలు అతిగా ఆహారం తిన్నా కూడా అనారోగ్యమే తెలుసా.. !!

Suma Kallamadi
చాలా మంది పిల్లలు ఆకలి ఉన్నప్పటికి సరిగ్గా ఆహారం తీసుకోకుండా అనారోగ్యల పాలవుతారు. మరికొంత మంది పిల్లలు తమకు ఇష్ఠమైన పదార్థాలను ఎక్కువగా తిని వ్యాధులు తెచ్చుకొంటారు. ఆకలి లేకపోయినా ఇష్టమైన ఆహారం కంటికి కనిపించే సరికి పిల్లలు ఆగలేక తినేస్తు ఉంటారు.  స్వీట్లు, చాక్లెట్లు వంటివి పిల్లలకు చాలా ఇష్ఠమని అందరికీ తెలిసిందే. ఇటువంటి తినుబండారాలను కొంత  మంది పిల్లలు అతిగా తింటుంటారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. ఇందువల్ల శరీరంలో కొవ్వు పెరిగి పిల్లలు స్థూలకాయులుగా తయారవడం, శరీరం ఎక్కువ బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయసు, ఎత్తుకు మించి బరువు ఉండడం కూడా మంచిది  కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.




అలాగే పిల్లలు ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం అన్నది వారసత్వరీత్యా కూడా సంక్రమించవచ్చు. ఇది వరకు కుటుంబంలో ఎవరన్నా ఈ లక్షణాలను ప్రదర్శిస్తే జన్యు రీత్యా వారి సంతానం కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది . పిల్లలు సరిగా తినడం లేదని కానీ లేదా ఎక్కువగా తింటున్నారని కానీ తల్లిదండ్రులు ఒక్కోసారి గుర్తించ లేకపోవచ్చు. వయసును బట్టి పిల్లల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తుంటాయి. పిల్లల పెరుగుదల క్రమంలో ఈ మార్పులు సహజం. కానీ అతిగా తినడం అనేది చిన్నప్పుడే అలవాటు అయితే పెద్ద అయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది.




అందుకనే పిల్లలకు ఒక్కసారిగా,  ఎక్కువగా ఆహారం పెట్టకుండా తక్కువగా పెట్టాలి. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుండి నూనె పదార్ధాలు ఎక్కువగా పెట్టకూడదు.. అలాగే పిజ్జాలు, బర్గర్లు లాంటి కొవ్వు పదార్ధాలతో కూడిన ఆహారం కూడా పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారం పెట్టడం మంచిది.పిల్లల శారీరక పెరుగుదల వారి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పెద్దవారిలో కంటే పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, వారికి సమతుల పోషక ఆహారం ఇవ్వడం తల్లిదండ్రులకు ఒక సవాల్ లాంటిది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: