బుడుగు: పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
పిల్లల పెంపకం అన్నది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల పెంపకం విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.అలా అని పిల్లలు తప్పు చేస్తే కఠినంగా శిక్షించకూడదు. కొట్టడం, తిట్టడం లాంటివి అసలు చేయకూడదు. ప్రేమ, ఆప్యాయతలతో  దగ్గరకు తీసుకుని వారు చేసింది తప్పు అని వాళ్ళ మనసులో మార్పు తీసుకురావాలి. అంతేగాని వాళ్ళని ప్రతి చిన్న తప్పుకు తిట్టడం చేయకూడదు. వాళ్ళు చిన్నపిల్లలు అభం శుభం తెలియని పసివాళ్లు. ఎది మంచో చెడో తెలుసుకునే వయస్సు వాళ్ళకి లేదు. 





చిన్నప్పటి  తల్లిదండ్రులు పెంపక విధానాలపై వారి నూరేళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. తప్పు చేస్తే అది తప్పు అని చిన్నతనం నుంచే చెప్పాలి అంతేగాని చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అని గారాబం చేయకూడదు. అలాగే ఇప్పుడు తల్లి తండ్రుల లైఫ్ స్టైల్ మొత్తం మొబైల్ లో గడపడం ఎక్కువ అయిపోయింది.ఉద్యోగాల వల్ల పిల్లల్తో ఆడే పాడే సమయం తక్కువ  అయిపోయింది.అసలు పిల్లలతో మాట్లాడే తీరికే వాళ్లకు ఉండడం లేదు. చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపకం విషయంలో లోపం ఉన్నట్లయితే వాటి పర్యవసానాలు, దుష్పరిమాణాలు పిల్లలు అనుభవించాలిసి వస్తుంది. పిల్లలను స్నేహ భావంతో పెంచితే ఇతరులు మీద ప్రేమ భావన పెంచుకుంటారు.




అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకేలాగా చూసుకోవాలి. అంతేగాని ఇద్దరి మద్యం బేధం చూపించకూడదు. అలా చూపిస్తే వాళ్ళకే తెలియకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం పెరిగిపోతుంది. అందుకనే ఇద్దరిని సమానంగా, ప్రేమగా చూసుకోవాలి. తల్లి తండ్రులు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పిల్లల వయసును బట్టి శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులు మారుతూ  ఉంటాయి. వాటిని పెద్దలు ముందుగా గ్రహించాలి. పిల్లలకు చిన్న వయసులోనే మంచిచెడుల పై అవగాహన కలిగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: