
బుడుగు : సీజనల్ వ్యాధుల నుండి మీ పిల్లల్ని కాపాడుకోవడం ఎలానో చుడండి.. !!
మీ బిడ్డను శుభ్రంగా మరియు పొడిగా ఉంచడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయము.ఈ సమయంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి కనుక పిల్లలకు దానికి అనుకూలమైన బట్టలు వేయాలి. ఫుల్ స్లీవ్స్ లో ఉండే మెత్తని కాటన్ బట్టలను వేయాలి. అవి వెచ్చగా ఉండడమే కాకుండా క్రిములు మరియు దోమల నుండి కూడా వారిని కాపాడుతాయి. మందంగా ఉండే బట్టలు వేయడం వల్ల పిల్లలకు చెమట పడుతుంది. ఆ చెమట పట్టే బాగాలే బ్యాక్టీరియాను పెంచి పోషించే ప్రదేశాలు. కాబట్టి తరచుగా ఈ సీజన్ లో బట్టలు మారుస్తూ ఉండాలి.అలాగే శిశువు యొక్క ప్రైవేట్ భాగాలను బాగా శుభ్రపరిచి ఎప్పుడూ పొడిగా ఉండేలా చూడటం చాలా అవసరం.
డైపర్లు ఉపయోగిస్తున్నట్లు అయితే తరచుగా మారుస్తూ ఉండండి. మార్చే ముందు ఆ భాగాలను శుభ్రపరుస్తూ ఉండండి.ఈ చల్లని వాతావరణంలో తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నప్పటికీ రోజులో కొంత సమయం డైపర్ వేయకుండా గాలి తగిలేలా ఉంచడం మంచిది.ఆహారం తినే వయస్సు వచ్చిన పిల్లలకు ఇంట్లోనే శుభ్రంగా ఉడికించిన ఆహారంను ఇవ్వండి. వర్షాకాలంలో ముఖ్యంగా నేల అంతా దుమ్ముతో నిండిపోతుంది. శిశువులు ఉన్న ఇంటిని కనీసం రోజుకి రెండు సార్లు శుభ్రపరచాలి.ఇంట్లో కానీ ఇంటి చుట్టు పక్కల కానీ నీటిని నిల్వ చేయకుండా చూసుకోండి.నీరు నిల్వ ఉంటే దోమలు వస్తాయి.మీ బిడ్డలను రద్దీగా ఉండే ప్రాంతాలకు తీసుకు వెళ్లడం అంటే అంటువ్యాధులకు ఆహ్వానం పలకడం లాంటిది . వర్షాకాలంలో గాలిలోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. అందువల్ల రద్దీగా ఉండే ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్లకపోవడమే మంచిది.. !!