బుడుగు : వర్షాకాలంలో పిల్లలకు అనారోగ్యాలు రాకుండా ఇలా జాగ్రత్తలు పాటించండి... !!

Suma Kallamadi

వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నారులకు జలుబు, దగ్గు అంటూ.. రకరకాల సమస్యలు వస్తాయి.అందులోను వర్షం అంటే పిల్లలకు మహా సరదా ఏదో ఒక వంక చెప్పి వర్షంలో తడుస్తారు.పిల్లల్లో  రోగనిరోధక శక్తి  తక్కువగా ఉంటుంది కాబట్టి.. వాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగు నీళ్లు.. వర్షపు నీళ్లు తాకి.. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రిమీకీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం, అలవాట్లపై చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం తీసుకొచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.

 

 

వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ కాబట్టి.. కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి. బయట దొరికే మజ్జిగ, నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. అలాగే ఐస్, కుల్ఫీ వంటి వాటికి దూరంగా పెట్టాలి.ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా వీలయినంత తాగించకపోవడం మంచిది. వర్షాకాలం ఎక్కువగా దొరికే పియర్, బొప్పాయి, దానిమ్మ, నేరేడు, యాపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.పిల్లలకు ఏ పూటకు ఆ పూట వండి పెట్టడం మంచిది. ఉదయం, రాత్రి వేడివేడిగా వండి తినిపిస్తే మంచిది. చాలా మంది తల్లులు మొలకెత్తిన గింజలు పిల్లలకు ఇస్తుంటారు.

 

 

 

కానీ.. వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది. అలా ఇవ్వడం కంటే ఉడకబెట్టి ఇస్తే మేలు.స్కూల్ కి వెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా.. రెయిన్ జాకెట్ వేయడం మంచిది. పాదాలు కూడా వర్షపు నీటిలో తడవకుండా.. వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.ఆడుకోవడం అది ఇదీ ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులు బ్యాక్టీరియా, వైరస్ లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా. చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు చేయాలి.ఇంట్లో నీటి నిల్వలు లేకుండా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: