బుడుగు : పిల్లల ముందు తల్లితండ్రులు ఇలాంటి పనులు అసలు చేయకూడదు.. !

Suma Kallamadi

 

పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. చిన్న వయసులో వాళ్ళ మనసులో ఏదన్నా ఒక విషయం జరిగితే అది ఎప్పటికి అలానే గుర్తుండిపోతుంది. అందుకే తల్లితండ్రులు పిల్లల ముందు కొన్ని పనులను ఎప్పటికి చేయకూడదు. పిల్లలను పెంచటం అనేది అంత సులభం తరమైన పని కాదు. తల్లితండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లవాడిని మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లితండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. ప్రతి పిల్లవాడికి తల్లి తండ్రి రోల్ మోడల్స్.. 

 

 


అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి.మీరు పిల్లల ప్రవర్తనను సరిచేయటానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. ఇది పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి.పిల్లలు ఉన్నపుడు పోట్లాడుకోవడం, ఒకళ్ళని ఒక్కళ్ళు విమర్శించుకోకూడదు. అంతేకాక ఈ పరిణామం పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తిని కలిగిస్తుంది.మీ పిల్లలు మీ ప్రవర్తనను అనుకరించటానికి ప్రయత్నం చేస్తారు. చిన్న వయస్సులోనే దూకుడు వంటి స్వభావం అలవడుతుంది.తల్లిదండ్రులు వినటం అలవాటు చేసుకోవాలి.. పిల్లలు చెప్పింది ఓపికగా వినాలి. లేకపోతే, మీ పిల్లలు నిర్లక్ష్యం అనుభూతికి గురి అవుతారు.మీ పిల్లలు ఒక అభిప్రాయంను వ్యక్తం చేస్తే, అభిప్రాయం సిల్లీగా ఉన్న సరే ఆతురుత లేకుండా వినండి. 

 

 


ఆ అభిప్రాయం సిల్లీగా ఉన్నప్పుడు కూర్చొని దాని గురించి వివరించండి. ఈ విధంగా చెప్పటం వలన పిల్లలకు హేతుబద్ధంగా ఆలోచించడం అలవాటు అవుతుంది.అతను లేదా ఆమె ప్రతి చోటా తప్పు భాషను ఉపయోగించటం ప్రారంభిస్తే అది వారిని పాడు చేయవచ్చు.మీ పిల్లలను అవమానించడం చేయకూడదు. అతను లేదా ఆమెకు మీ మీద వ్యతిరేకంగా ప్రతికూల భావాలు కలగవచ్చు.కావున పిల్లలు ఉన్నపుడు తల్లితండ్రులు ఇద్దరు పిల్లల పట్ల భాద్యతయుతంగా ప్రవర్తించాలి.ఇప్పటి పిల్లలే రేపటి మన ఆశకిరణాలు... !!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: