బుడుగు :వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఎలా.. !!
వేసవి కాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండ ప్రభావం పిల్లల మీద ఎక్కువగా పడుతుంది.కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్ని ఎండ వేడి నుంచి కాపాడుకోవచ్చు. వేసవిలో పిల్లలకు శీతలపానీయాలు ఇవ్వకూడదు. దానికి బదులుగా పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, నిమ్మరసం ఇవ్వడం మంచిది.
ఎండదాటికి పిల్లలు ఫ్రిజ్జుల్లోని ఐస్ నీళ్ళు తాగటానికి ఇష్టపడతారు . ఇవి ఆకలిని మరింత తగ్గిస్తాయి కానుక ఈ కాలంలో కుండలో పోసిన చల్లని నీళ్ళను మాత్రమే తాగాలి. పిల్లలు తీసుకొనే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. ఎక్కువగా ఉప్పగా, ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని, పిత్తాన్ని రేగేల చేస్తాయి దేనివల్ల విరేచనాలు అయి పిల్లలు బలహీన పడతారు కనుక తీసుకొనే ఆహారంలో ఉప్పు, కారం తక్కువ మోతాదులో వాడుకోవాలి. పిల్లల్ని బయటకు తీసుకుని వెల్లవలిసిన అవరసం వచ్చినపుడు తలను, మెడను కాటన్ గుడ్డతో కప్పుకోవాలి, టోపీ పెట్టాలి లేదు అంటే గొడుగు తీసుకొని వెళ్ళండి, సన్ గ్లాసెస్ పెట్టండి.
.మామిడికాయ ముక్కలపైన ఉప్పు చల్లి పిల్లలకు తినిపించడం వల్ల శరీరంలో వేడి తగ్గి, జీర్ణశక్తిని పెంచుతుంది.కొన్ని పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శీతల పానీయాల కంటే కలబందను తీసుకొంటే మంచిది అని ఆయుర్వేద నిపుణులు చెపుత్నారు.శరీరంలో ఎక్కువ శాతం నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది దేని కారణంగా డిహైడ్రాషన్ కి గురివుతారు, కాబట్టి పిల్లలకు ఎక్కువగా నీరు తాగించడం అవసరం.
నీటి శాతం పుష్కలంగా ఉన్న పుచ్చకాయ, కీరదోస, చెరుకు ముక్కల్ని కూడా తరచుగా పిల్లలకు పెట్టవచ్చు. వీటిలో నీరు శాతం అధికంగా ఉంటుంది కావున పిల్లలు డిహైడ్రాషన్ నుండి బయట పడవచ్చు.
గోరువెచ్చని నీళ్లతో వేసవికాలంలో స్నానం చేస్తే ఉడుకు పోక్కులు రావు.శరీరంలో తగినంత నీరు లేనప్పుడు పిల్లలు అలసిపోవచ్చు.
వేసవికాలంలో తగినంత నిద్ర పోవాలి.నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలు పిల్లలకు పెట్టవద్దు.