బుడుగు : అనుకోకుండా వచ్చిన సెలవుల్లో మీ పిల్లల చేత ఇలాంటి పనులు చేయించండి...!! ఫలితం మీరే చుడండి.. !!

Suma Kallamadi
అనుకోని సెలవులతో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే స్థిరంగా ఉంటున్నారు. ఇటువంటి సమయం మళ్లీ రాకపోవచ్చు ఎందుకంటే నిత్య జీవితంలో ఎవరి పనిలో వారు తీరిక లేకుండా ఉంటాము. ఇటువంటి ఖాళీ సమయంలో మీరు మీ పిల్లల మనసును తెలుసుకోవడానికి బంధాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోండి.

సమయం విలువ ఫోన్లకు మరియు టీవీలకు అతుక్కుపోతున్న మీ పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు కాబట్టి ఇట్టి ఖాళీ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆలోచించండి. మీ పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయించండి.

 కథల పుస్తకాలు, పేపర్ గాని లేదా ఇంకా ఏది అందుబాటులో ఉంటే అది చదవమనండి. ఈరోజు పేపర్ అందుబాటులో లేకుంటే నిన్నటిది మొన్నటిది లేదా ఏడాది కిందటది ఏదైనా సరే చదవడం వల్ల పఠనం అలవాటవుతుంది.బొమ్మలు గీయించండి.ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏం చేశారో రాయమనండి

 మీ ఇంట్లో రోజు వండే కూర గురించి లేదా మీరు రోజు చేసే పనిని గురించి, మీ ఊరు గురించి, వారి బడి గురించి, కుటుంబసభ్యుల గురించి, చుట్టాల గురించి, మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిన పెళ్లి లేదా ఫంక్షన్ గురించి చెప్పమనండి లేదా రాయ మనండి.

ఇందువలన పిల్లల్లో రచనా కౌశల్యం అలవడి దస్తూరి మెరుగుపడుతుంది.మీకు వచ్చిన వృత్తి విద్యలు లేదా సరదాగా మీరు నేర్చుకున్న విద్యను పిల్లలకు నేర్పండి.

మీ వంశ వృక్షం తయారుచేసి కుటుంబం గురించి బంధువుల గురించి బాంధవ్యాల గురించి తెలియజేయడానికి మంచి సమయం ఇది.ఇంట్లోనే అనేక జీవన నైపుణ్యాలు పిల్లలకు నేర్పవచ్చు.

మీరు నీతి కథలు పిల్లలకు చెప్పండి పొద్దంతా కాదు సుమా ,రోజులో ఒక గంట లేదా రెండు గంటలు వారి కోసం మీ వ్యక్తిగత పర్యవేక్షణలో మాత్రమే చేయించండి.

మీ పిల్లలతో క్యారమ్స్, చెస్, అష్టా చమ్మా మరియు పచ్చీస్ లాంటి ఆటలు ఆడండి.మన ఇతిహాసాల గురించి వివరించండి.రాముడు,లక్ష్మణుడు ఏ విధంగా ఒకరికొకరు తోడుగా పెరిగారు అంతే కాకుండా తమ్ముడు అన్నను ఏ విధంగా గౌరవించాడు అనే విషయాలను గూర్చి పిల్లలతో చర్చించండి.తద్వారా వాళ్లకు ఇతిహాసాల ప్రాముఖ్యం తెలుస్తుంది.ఈ తరం పిల్లలు ప్రతీ చిన్న చిన్న తప్పులకే కృంగి పోతున్నారు.అనుకోకుండా వచ్చి పడే కష్టాల నుండి ఎలా గట్టెక్కాలో వారికి తెలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: