బుడుగు: మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారా.. ! అయితే తప్పకుండా ఇలాంటి ఆహారం పెట్టండి.. !

Suma Kallamadi

పిల్లల పెంపకం నేడు తల్లులకు ఒక పెద్ద పనిగా  మారుతోంది. పుట్టినప్పటి నుండి పిల్లలకి  ఎదో ఒక ఆరోగ్య సమస్య, వాళ్లేమో చెప్పలేరు, ఏడుస్తారు. అయితే సరయిన పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళ  పోషణ అనేది మంచిగా ఉంటుంది. అయితే ఏడాది లోపు పిల్లలకు తల్లిపాలే ఎంతో మంచివి. తల్లి పాలల్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి తల్లి పాలు. 

 

ఆస్తమా, ఎలర్జీల నుంచి బిడ్డలను కాపాడుకోవచ్చు.  దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ విటమిన్ డి తగినంత అందదు. అందుకే వీరిని ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో కొంత సేపు ఎండలో ఉంచితే విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి వల్ల ఎముకలు గట్టి పడతాయి.. ఇది ఉదయం పూట  సూర్యరశ్మిలో ఎక్కువ ఉంటుంది. లేదంటే విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలి.

 

 

అలానే ఐరన్ కూడా వీరికి తగినంత అందదు. అందుకే వైద్యులు ఐరన్,జింక్ విటమిన్స్ కూడిన డ్రాప్స్‌ను సూచిస్తుంటారు. నెలల బిడ్డలకు పోషకాహారం అందాలంటే తల్లులు కూడా పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.   పాలు సరిపడా ఉండాలంటే తల్లి మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఒకవేళ బిడ్డకి  తల్లిపాలు  సరిపోక  పోతే  విడిగా పాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎముకులు, దంతాలకు కాల్షియం చాలా అవసరం. శరీర నిర్మాణంతో  పాటు,  కండరాల మరియు  ఎముకల పెరుగుదల కూడా ముఖ్యం. 6 నెలల దాక తల్లి పాలు శ్రేయస్కరం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: